సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Liger సినిమాలో హీరో Vijay Deverakonda కంటే.. ఆయనకే ఎక్కువ రెమ్యూనరేషన్..!

ABN, First Publish Date - 2021-10-04T20:46:44+05:30

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ హీరో విజ‌య్ దేవ‌రకొండ న‌టిస్తున్న తాజా చిత్రం `లైగ‌ర్`.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ హీరో విజ‌య్ దేవ‌రకొండ న‌టిస్తున్న తాజా చిత్రం `లైగ‌ర్`. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ారు. దీంతో ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి. ఈ సినిమాలో నటిస్తున్నందుకు మైక్ టైస‌న్ భారీ పారితోషికం అందుకోబోతున్నారట. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కంటే ఎక్కువ మొత్తంలో మైక్ టైస‌న్ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌న్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. 


ఈ సినిమాలో విజయ్.. బాక్సర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్‌లో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కనిపించనున్నారట. ఆ సీన్ కోసమే టైసన్ భారీగా పారితోషికం అందుకోనున్నారట. అయితే `లైగర్` టీమ్ ఈ వార్తలను కొట్టిపడేసింది. `విజయ్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో మీకు తెలియదు.. మైక్ టైసన్ రెమ్యునరేషన్ ఎంతో తెలియదు. అలాంటపుడు ఒకరి కంటే మరొకరికి ఎక్కువని ఎలా అంటారు` అంటూ పూరీ టీమ్ కౌంటర్లు ఇస్తోంది. అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

Updated Date - 2021-10-04T20:46:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!