సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పేరు మార్చుకొని ప్రయత్నిస్తోంది..!

ABN, First Publish Date - 2021-06-20T16:04:34+05:30

అజయ్ హీరోగా నటించిన 'ఆ ఒక్కడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది మధురిమ బెనర్జీ. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా, ఈమెకి మాత్రం వరుసగా కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలలో నటించింది. అయితే తెలుగులో ఈమెకి ఒక్క భారీ హిట్ కూడా దక్కలేదు. దాంతో మధురిమకి తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజయ్ హీరోగా నటించిన 'ఆ ఒక్కడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది మధురిమ బెనర్జీ. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా, ఈమెకి మాత్రం వరుసగా కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలలో నటించింది. అయితే తెలుగులో ఈమెకి ఒక్క భారీ హిట్ కూడా దక్కలేదు. దాంతో మధురిమకి తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. స్పెషల్ సాంగ్, టెంపర్ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించినా ఈమెకి రావాల్సిన క్రేజ్ రాలేదు. దాంతో ఇప్పుడు తన పేరును నైరా బెనర్జీగా మార్చేసుకుంది మధురిమ. ఈ పేరుతో బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రత్నిస్తోంది. తాజాగా 'హలో జీ' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నఇందులో ఆమె పాత్రకి ప్రశంసలు దక్కుతున్నాయట. బోల్డ్ పాత్రలో నైరా బెనర్జీ హిందీ ప్రేక్షకులను, మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంటోందని చెప్పుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్ తర్వాత  నైరా బెనర్జీకి మరిన్ని అవకాశాలు దక్కడం ఖాయమని నమ్మకంగా ఉందట. చూడాలి మరి నైరా బెనర్జీగా పేరు మార్చుకున్న మధురిమ బెనర్జీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో.    

Updated Date - 2021-06-20T16:04:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!