సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'సూరారై పోట్రు' హిందీ రీమేక్‌కి లైన్ క్లియర్..!

ABN, First Publish Date - 2021-09-09T15:04:19+05:30

బాలీవుడ్‌లో తెరకెక్కించబోతున్న 'సూరారై పోట్రు' హిందీ రీమేక్‌కి లైన్ క్లియర్ అయినట్టు తాజా సమాచారం. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'సూరారై పోట్రు' తెలుగులోనూ 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో తెరకెక్కించబోతున్న 'సూరారై పోట్రు' హిందీ రీమేక్‌కి లైన్ క్లియర్ అయినట్టు తాజా సమాచారం. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'సూరారై పోట్రు' తెలుగులోనూ 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్స్ మూతపడి ఉండటంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేబోతున్నట్టు సూర్య ప్రకటించారు. తమిళ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ సుధ కొంగర హిందీ రీమేక్‌ని తెరకెక్కించనున్నారు. 


అయితే, తమిళ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన శిఖ్యా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమా హిందీ రీమేక్‌పై కోర్టుకు కెళ్ళింది. 'సూరారై పోట్రు' చిత్రానికి మేమూ నిర్మాతలమేనంటూ, మమ్మిలిని సంప్రదించకుండానే హిందీ రీమేక్‌కు సూర్య నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ రెడీ అయ్యారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రాధమిక విచారణ తర్వాత హిందీ రీమేక్ షూటింగ్‌పై మద్రాస్ హైకోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇష్యూ చేసింది. తాజాగా దానిని కోర్టు వెకేట్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో సూర్య టీమ్ 'సూరారై పోట్రు' హిందీ రీమేక్ ప్రారంభించడానికి లైన్ క్లియర్ అయింది. ఇందులో నటించే నటీ నటులు సహా మిగతా విషయాలను త్వరలో వెల్లడించనున్నారు. 

Updated Date - 2021-09-09T15:04:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!