మరోసారి ‘ రైడ్ ’ చేస్తామంటున్న Kumar Mangat Pathak

ABN , First Publish Date - 2021-12-29T21:44:02+05:30 IST

భిన్న రకాల పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు అజయ్ దేవగణ్. అతడు హీరోగా తెరకెక్కిన సినిమా రైడ్. ఇలియానా హీరోయిన్‌గా నటించింది

మరోసారి ‘ రైడ్ ’ చేస్తామంటున్న Kumar Mangat Pathak

భిన్న రకాల పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు అజయ్ దేవగణ్. అతడు హీరోగా తెరకెక్కిన సినిమా రైడ్. ఇలియానా హీరోయిన్‌గా నటించింది. 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఒక రియల్ కథను ఆధారంగా చేసుకుని రైడ్ సినిమాను నిర్మించారు . ఆ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తామని తాజాగా నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ తెలిపారు.


కాన్పూర్, కనౌజ్ ప్రాంతాలల్లో ఫర్‌ఫ్యూమ్ వ్యాపారం చేసే పీయూష్ జైన్ జీవితం ఆధారంగా సినిమాను నిర్మిస్తామని పాఠక్ వెల్లడించారు. ఈ మధ్యనే పీయూష్ జైన్ ఇంటిపై  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు రైడ్స్ చేశారు. ఈ రైడ్స్ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తామన్నారు. వారాణాసిలో కాశీ ఫిలిం ఫెస్టివల్ మెదటి ఎడిషన్ జరిగింది. ప్యానెల్ చర్చలో భాగంగా సినిమాకు స్వీక్వెల్‌ను తెరకెక్కిస్తామని ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే పీయుష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీపై డీజీజీఐ అధికారులు రైడ్స్ చేశారు. ఈ రైడ్స్‌లో 25కేజీల బంగారం, పావుకిలో వెండి, రూ.257కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-12-29T21:44:02+05:30 IST