బాలీవుడ్ స్టార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేఆర్‌కే.. దాని కోసం అతని తండ్రి ఎంత ముట్టజెప్పాడో తెలుసా అంటూ..

ABN , First Publish Date - 2021-11-29T19:32:23+05:30 IST

స్వయం ప్రకటిత సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్‌కి కాంట్రవర్సీల్లో వేలు పెట్టడం చాలా ఇష్టం. అందుకే తరచుగా కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు...

బాలీవుడ్ స్టార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేఆర్‌కే.. దాని కోసం అతని తండ్రి ఎంత ముట్టజెప్పాడో తెలుసా అంటూ..

స్వయం ప్రకటిత సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్‌కి కాంట్రవర్సీల్లో వేలు పెట్టడం చాలా ఇష్టం. అందుకే తరచుగా కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే అది కేఆర్‌కేని ఏ మాత్రం ఎఫెక్ట్ చేయలేదని.. తాజాగా అతను చేసిన కామెంట్స్ చూస్తే అర్థం అవుతోంది.


స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ని ‘బ్యాండ్ బాజా బారాత్‌’తో అనుష్క శర్మకి జోడిగా యశ్ రాజ్ ఫిల్మ్ బాలీవుడ్‌కి పరిచయం చేసింది. ఇందులో బిట్టూ శర్మ పాత్రను పోషించగా.. బెస్ట్ మేల్ డెబ్యూ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు రణ్‌వీర్. అయితే నిజానికి ఈ హీరోని లాంఛ్ చేసింది వైఆర్‌ఎఫ్ అధినేత ఆదిత్య చోప్రా కాదని.. ఆయన తండ్రని కేఆర్‌కే సంచలన వ్యాఖ్యలు చేశాడు.


రాణీ ముఖర్జీ, సైఫ్ అలీ ఖాన్ జంటగా చేసిన ‘బంటీ ఔర్ బబ్లీ‌ 2’ సినిమా రివ్యూని ఓ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు ఈ క్రిటిక్. అందులో ఆదిత్య చోప్రా ఎవరినీ పరిచయం చేసిన వారి కెరీర్ సూపర్ ఫ్లాప్‌గా మారిపోతుందని చెప్పాడు. దానికి రణ్‌వీర్‌ని పరిచయం చేసింది కూడా ఆదిత్యనే కదాని చాలామంది కామెంట్స్ పెట్టారు. దానికి కౌంటర్‌గా ఆ హీరోని లాంఛ్ చేసింది యశ్ ఫిల్మ్స్ కాదని.. ఆయన తండ్రి జగ్జీత్ సింగ్ భవ్నానీ అని చెప్పాడు. ఆయన కుమారుడిని ఇండస్ర్టీకి పరిచయం చేయమని ఆ ప్రొడక్షన్ హౌస్‌కి 20 కోట్లు ఇచ్చాడని, ఇతను వారి ఖాతాలోకి రాడని తెలిపాడు. ఆ వైరల్ వీడియోని మీరు ఓ సారి చూడండి..Updated Date - 2021-11-29T19:32:23+05:30 IST