పాము కంటే సల్మాన్‌కే విషం ఎక్కువని కేఆర్‌కే కామెంట్స్.. నువ్వు మనిషివేనా అంటూ..

ABN , First Publish Date - 2021-12-28T21:04:23+05:30 IST

కిస్మస్, పుట్టిన రోజు వేడుకలకి ఫామ్‌హౌస్‌కి వెళ్లిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ని డిసెంబర్ 25న పాము కాటేసిన విషయం తెలిసిందే. అనంతరం చికిత్స తీసుకొగా ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నాడు...

పాము కంటే సల్మాన్‌కే విషం ఎక్కువని కేఆర్‌కే కామెంట్స్.. నువ్వు మనిషివేనా అంటూ..

కిస్మస్, పుట్టిన రోజు వేడుకలకి ఫామ్‌హౌస్‌కి వెళ్లిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ని డిసెంబర్ 25న పాము కాటేసిన విషయం తెలిసిందే. అనంతరం చికిత్స తీసుకొగా ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే సినీ విమర్శకుడిగా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్ ఎప్పటిలాగే ఈ నటుడిపై మరోసారి విమర్శలు గుప్పించాడు.


సల్మాన్ గురించి ఓ ట్వీట్‌లో ప్రస్తావిస్తూ.. ‘పాము తన పనిని బాగా చేసింది, కానీ అది కాటువేసిన వ్యక్తిలో దీనికంటే ఎక్కువ విషం ఉన్నందున అదే చనిపోయింది’ని రాసుకొచ్చాడు. అయితే దీనిపై ఈ క్రిటిక్‌ సోషల్ మీడియాలో నువ్వు అసలు మనిషివేనా అంటూ విపరీతంగా ట్రోల్ చేశారు సల్లు భాయ్ ఫ్యాన్స్.


‘మీలో చాలా నెగటివిటీ ఉంది. ప్రజల నొప్పి, ప్రమాదాలను ఎగతాళి చేసే విధానం ఏం బాగాలేదు. అల్లాహ్‌కు భయపడండి’ అంటూ ఓ నెటిజన్లు కామెంట్ పెట్టాడు. ‘ఈ చెత్తని ఆపేయ్ కేఆర్‌కే.. హద్దులు మీరుతున్నార’ని ఇంకొకరు చేశాడు. ‘నువ్వు ఇతరులపై విషం చిమ్ముతూ, దుర్భాషలాడుతూ ఉండటం  చూస్తుంటే.. నువ్వే అన్ని ప్రాణాంతక పాములను కంటే చాలా విషపూరితమని అనిపిస్తోంది! నువ్వు ఇలా ట్వీట్ కరెక్ట్‌గా లేదు. ఇలా చెబుతున్నందుకు క్షమించమ’ని ఇంకొక విమర్శలు గుప్పించాడు. ఈ ట్వీట్స్‌పై మీరు ఓ లుక్కేయండి..

Updated Date - 2021-12-28T21:04:23+05:30 IST