సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మరో మెట్టు ఎక్కాను

ABN, First Publish Date - 2021-08-29T05:51:53+05:30

హీరోల పక్కన గ్లామర్‌ తారగా ఆడిపాడడమే కాదు, అవకాశం దొరికితే నటనకు ఆస్కారమున్న పాత్రలను పోషించటానికి హీరోయిన్లు ముందు ఉంటారు. అలాంటి అవకాశం తనకు ‘మిమి’ చిత్రంతో దక్కింది అన్నారు కృతీసనన్‌. గతనెల్లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోల పక్కన గ్లామర్‌ తారగా ఆడిపాడడమే కాదు, అవకాశం దొరికితే నటనకు ఆస్కారమున్న పాత్రలను పోషించటానికి హీరోయిన్లు ముందు ఉంటారు. అలాంటి అవకాశం తనకు ‘మిమి’ చిత్రంతో దక్కింది అన్నారు కృతీసనన్‌.  గతనెల్లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అద్దెగర్భం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో గర్భవతి పాత్రలో కృతీ ఆకట్టుకున్నారు. ఈ పాత్ర కోసం ఆమె బరువు కూడా పెరిగారు. ‘‘ఇది నా హృదయానికి దగ్గరైన కథ. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన, నాకు ప్రశంసలు వస్తున్నాయి. మీరు నాపై చూపించే అభిమానం, ప్రేమ, ప్రశంసలకు రుణ పడి ఉన్నాను. ‘మిమి’ సినిమాకు దక్కుతున్న ఆదరణతో చాలా సంతోషంగా ఉంది’’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. 

Updated Date - 2021-08-29T05:51:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!