మరో మెట్టు ఎక్కాను
ABN , First Publish Date - 2021-08-29T05:51:53+05:30 IST
హీరోల పక్కన గ్లామర్ తారగా ఆడిపాడడమే కాదు, అవకాశం దొరికితే నటనకు ఆస్కారమున్న పాత్రలను పోషించటానికి హీరోయిన్లు ముందు ఉంటారు. అలాంటి అవకాశం తనకు ‘మిమి’ చిత్రంతో దక్కింది అన్నారు కృతీసనన్. గతనెల్లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి...

హీరోల పక్కన గ్లామర్ తారగా ఆడిపాడడమే కాదు, అవకాశం దొరికితే నటనకు ఆస్కారమున్న పాత్రలను పోషించటానికి హీరోయిన్లు ముందు ఉంటారు. అలాంటి అవకాశం తనకు ‘మిమి’ చిత్రంతో దక్కింది అన్నారు కృతీసనన్. గతనెల్లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అద్దెగర్భం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో గర్భవతి పాత్రలో కృతీ ఆకట్టుకున్నారు. ఈ పాత్ర కోసం ఆమె బరువు కూడా పెరిగారు. ‘‘ఇది నా హృదయానికి దగ్గరైన కథ. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన, నాకు ప్రశంసలు వస్తున్నాయి. మీరు నాపై చూపించే అభిమానం, ప్రేమ, ప్రశంసలకు రుణ పడి ఉన్నాను. ‘మిమి’ సినిమాకు దక్కుతున్న ఆదరణతో చాలా సంతోషంగా ఉంది’’ అని ఆమె ఇన్స్టాగ్రామ్లో తెలిపారు.