సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇన్‌స్టాగ్రామ్‌ డెబ్యూ... Khushi Kapoor, Janhvi Kapoor మనసు దోచిన అందగాడి అరంగేట్రం!

ABN, First Publish Date - 2021-12-30T23:01:51+05:30

జాన్వీ, ఖుషీల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు ‘పాండా కపూర్’ రంగంలోకి దిగాడు. అతనెవరు అంటారా? జాన్వీ, ఖుషీలకు బాగా కావాల్సిన వాడు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతిలోక సుందరి అందాల వారసురాళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇప్పటికే పెద్ద సెన్సేషన్స్. జాన్వీ ఆల్రెడీ సినిమాలు చేస్తూ తన గ్లామర్‌తో కుర్రాళ్ల గుండెలకు గాయాలు చేస్తోంది. జూనియర్ కపూర్ గాళ్ ఖుషీ అయితే ఇంకా డెబ్యూ కూడా కాక ముందే లక్షలాది మందికి హాట్ ఫేవరెట్ అయిపోయింది. పొడుగు కాళ్ల సుందరి క్రేజ్ ఏంటో తెలియాలంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ చూస్తే చాలు. మిలియన్ల కొద్దీ నెటిజన్స్ ఆమెను ఫాలో అవుతున్నారు.

జాన్వీ, ఖుషీల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు ‘పాండా కపూర్’ రంగంలోకి దిగాడు. అతనెవరు అంటారా? జాన్వీ, ఖుషీలకు బాగా కావాల్సిన వాడు! కాకపోతే, ఈ పాండా కపూర్ మనిషి కాదండోయ్... కుక్క! ఓస్ అంతేనా అంటూ పెదవి విరిచేయకండి. జాన్వీ, ఖుషీల ఫేవరెట్ పెట్ డాగ్ అయిన పాండా ఇన్‌స్టాగ్రామ్‌లో డెబ్యూ చేశాడు. వచ్చీ రాగానే వంద మార్కు దాటేసిన శునకంగారు వెయ్యి దిశగా వేగంగా సాగిపోతున్నారు. జాన్వీ, ఖుషీ మీద అభిమానంతో నెటిజన్స్ ‘పాండా కపూర్’ ఇన్‌స్టా అకౌంట్‌ని పోలోమని ఫాలో అయిపోతున్నారు.       

కపూర్ గాళ్స్ కెరీర్స్ విషయానికి వస్తే... ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోన్న జాన్వీ కపూర్ తాజాగా రాజ్ కుమార్ రావ్‌తో ‘మిష్టర్ అండ్ మిసెస్ మహీ’ సినిమాలో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు, దర్శకురాలు జోయా అఖ్తర్ ప్రాజెక్ట్‌తో ఖుషీ కపూర్ కూడా బాలీవుడ్ బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.

Updated Date - 2021-12-30T23:01:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!