ఆరాధ్య గురించి ప్రశ్నించిన బాలుడు.. షాక్ అయిన Amitabh Bachchan..

ABN , First Publish Date - 2021-11-16T21:05:09+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’. ఇప్పటికి 12 సీజన్లను సక్సెస్ ఫుల్‌గా పూర్తి..

ఆరాధ్య గురించి ప్రశ్నించిన బాలుడు.. షాక్ అయిన Amitabh Bachchan..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’. ఇప్పటికి 12 సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తి కాగా ప్రస్తుతం 13వ సీజన్ సోనీ టీవీలో ప్రసారమవుతోంది. మామూలుగా షోలో తన ప్రశ్నలతో కంటెస్టెంట్స్‌ని షాక్ అయ్యేలా చేస్తాడు బిగ్ బీ. అయితే ఓ బాలుడు తన క్వశ్చన్స్‌తో ఈ స్టార్‌నే షాక్‌కి గురి చేశాడు.


చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ వారాన్ని కేటాయించారు ఈ షో నిర్వాహకులు. వీటిలో కంటెస్టెంట్స్‌‌గా పాల్గొన్న విద్యార్థులతో బిగ్ బీ గేమ్ ఆడిస్తున్నాడు. అయితే ఈ షో తాజా ఎపిసోడ్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సోనీ టీవీ. అందులో పాల్గొన్న ఆరాధయ్ అనే బాలుడు తన ప్రశ్నలతో అమితాబ్‌ని షాక్‌కి గురి చేశాడు.


ఆ వీడియోలో ఆరాధయ్.. ‘సర్.. మీరింతా ఎత్తుంటారు కదా, ఇంట్లోని ఫ్యాన్స్ అన్నింటినీ మీరే క్లీన్ చేస్తారా?, ‘మీరు ఆరాధ్య స్కూల్ వార్షికోత్సవానికి వెళ్లినప్పుడు, అక్కడి జనాలు షోని చూస్తారా లేదా మీమ్మల్నా?’, ‘మీ చిన్పప్పుడు తప్పు చేస్తే మీ అమ్మ మిమ్మల్ని కొట్టేవారా?’ అంటూ వరుస ప్రశ్నలను కురిపించాడు. వాటికి షాక్ అయిన అమితాబ్ అతనికి చాలా టాలెంట్ ఉందని, ఖచ్చితంగా అన్ని బయటికి లాగుతాడని చమత్కరించాడు.



Updated Date - 2021-11-16T21:05:09+05:30 IST