40 మంది కళాకారులు... 1800 గంటల శ్రమ... కత్రీనా చీర!

ABN , First Publish Date - 2021-12-14T22:41:46+05:30 IST

ఇంటర్నెట్‌లో కత్రీనా, విక్కీ కౌశల్ పెళ్లి హడావిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా కొత్త దంపతులు తమ ఫ్యాన్స్‌కి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ట్రీట్ అందించారు. విక్కీ, క్యాట్ తమతమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా అభిమానులు మురిసిపోయేలా అందమైన పిక్స్ షేర్ చేశారు...

40 మంది కళాకారులు... 1800 గంటల శ్రమ... కత్రీనా చీర!

ఇంటర్నెట్‌లో కత్రీనా, విక్కీ కౌశల్ పెళ్లి హడావిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా కొత్త దంపతులు తమ ఫ్యాన్స్‌కి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ట్రీట్ అందించారు. విక్కీ, క్యాట్ తమతమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా అభిమానులు మురిసిపోయేలా అందమైన పిక్స్ షేర్ చేశారు... 

పెళ్లికి ముందు తీసిన ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోస్‌లో కత్రీనా కళ్లు చెదిరేలా వింటేజ్ లుక్‌తో ఆకట్టుకుంది. ఆమె ధరించిన డిజైనర్ శారీ పొడవాటి పైట కొంగుతో రాజసం చిందిస్తూ దర్శనమిచ్చింది. అయితే, ఈ చీరని డిజైనర్ సబ్యసాచి బాలీవుడ్ స్టార్ బ్యూటీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కత్రీనా తల్లి తాలూకూ బ్రిటీష్ వారసత్వానికి ప్రతీకగా ‘వింటేజ్ ఇన్‌స్పైర్డ్ కౌచర్ శారీ‘ని రూపొందించానని సబ్యసాచి చెప్పారు. కత్రీనా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చీర కోసం 40 మంది కళాకారులు 1800 గంటల పాటూ శ్రమించారట! అప్పుడుగానీ అమ్మాయిగారి అందాల వస్త్రానికి అలంకారాలు పూర్తి కాలేదట!Updated Date - 2021-12-14T22:41:46+05:30 IST