సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vicky Kaushal, Katrina Kaif పెళ్లిలో డ్యాన్స్ చేయనున్న Kiara Advani, Sidharth Malhotra

ABN, First Publish Date - 2021-11-18T00:45:59+05:30

డిసెంబరు మొదటి వారంలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకోబోతున్నారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిసెంబరు మొదటి వారంలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకోబోతున్నారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్‌లో వీరి వివాహం జరగబోతుందని తెలుస్తోంది. ఏక్ థా టైగర్ సినిమాకు దర్శకత్వం వహించిన కబీర్ ఖాన్ నివాసంలో దీపావళి రోజును వీరి రోకా వేడుక జరిగింది. ఆ వేడుకకు ఇరు కుటుంబాల సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 


విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లికి సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ, కరణ్ జోహార్ హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పెళ్లిలో సిదార్థ్ మల్హోత్రా తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అయిన కియారా అడ్వాణీతో కలిసి డ్యాన్స్ చేయనున్నట్టు బీ‌ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత అయిన కరణ్ జోహర్‌కు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందువల్ల అతడు కూడా కాలు కదపనున్నాడని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. కబీర్ ఖాన్, మిని మాథూర్, అలీ అబ్బాస్ జాఫర్, వరుణ్ జాఫర్, నటాషా దలాల్‌తో సహా ఇతర బాలీవుడ్ బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ పెళ్లికి హాజరుకాబోతున్న అతిథుల లిస్ట్‌లో ఉన్నారు.  


ఈ పెళ్లికి బాలీవుడ్ కండల వీరుడైన సల్మాన్ ఖాన్ హాజరు కావడం లేదు. సల్మాన్ ఖాన్  టైగర్ -3 కి సంబంధించి కొన్ని సీన్స్‌ను చేయవలసి ఉన్నందున ఈ ఫంక్షన్‌కు రావడం లేదు. పఠాన్ షూటింగ్ నిమిత్తం షారూక్ ఖాన్ స్పెయిన్‌కు వెళ్లనున్నాడు. ఆ షెడ్యూల్ మొత్తం క్యాట్ పెళ్లితో క్లాష్ అవుతోంది. అందువల్ల సల్మాన్, షారూక్ ఇద్దరూ కూడా వీరి వివాహానికి రావడం లేదు.

Updated Date - 2021-11-18T00:45:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!