Katrina Kaif-Vicky Kaushal పెళ్లి ముహూర్తం కుదిరిందా?
ABN , First Publish Date - 2021-11-01T20:23:11+05:30 IST
బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ కౌశల్-కత్రినాకైఫ్ ప్రేమాయణం క్లైమాక్స్‌కు చేరుకుందా?

బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ కౌశల్-కత్రినాకైఫ్ ప్రేమాయణం క్లైమాక్స్‌కు చేరుకుందా? వచ్చే నెల ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు. కొద్ది రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. డిసెంబర్ ఏడో తేదీన వీరి పెళ్లి జరగబోతోందని, డిసెంబర్ 1వ తేదీ నుంచి పెళ్లి పనులు ప్రారంభమవుతాయని పేర్కొంది.
రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌కు సమీపంలో ఉన్న ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరగబోతోందట. బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన దుస్తులను వీరిద్దరూ పెళ్లి రోజు ధరించబోతున్నారట. ఈ వార్తలను అటు కత్రిన కాని, ఇటు విక్కీ కాని ధ్రువీకరించడం లేదు, ఖండించడం లేదు. అయితే కత్రిన తల్లి, సోదరి ఇటీవల ముంబైలోని పెళ్లి బట్టల దుకాణంలో కనిపించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. మరి, ఈ పెళ్లి వార్తలు నిజమో, కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.