స్టార్ అతిథుల కోసం విక్కీ, Katrina Kaif ఎన్ని హోటల్స్ బుక్ చేశారంటే..

ABN , First Publish Date - 2021-11-29T16:52:36+05:30 IST

బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే...

స్టార్ అతిథుల కోసం విక్కీ, Katrina Kaif ఎన్ని హోటల్స్ బుక్ చేశారంటే..

బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కపుల్ వివాహం గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త బయటికొస్తోంది. తాజాగా మరో న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అదే ఈ జంట పెళ్లికి ఎంతో మంది సెలబ్రిటీ అతిథులు వస్తుండగా.. వారి కోసం 40కి పైగా హోటల్స్ బుక్ చేశారని.


రాజస్థాన్‌లోని సోవాయ్ మాదోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ రిసార్ట్, బర్వారా‌లో డిసెంబర్ 9 వారు మ్యారేజ్ జరగనుండగా.. 7వ తేది నుంచే గెస్ట్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఎంతోమంది బాలీవుడ్ సెటబ్రిటీలు అతిథులుగా రానుండడంతో దగ్గరలోని రతన్‌బోర్‌లో దాదాపు 45 హోటల్స్‌లోని పూర్తి గదులను బుక్ చేసినట్లు సమాచారం. వీటి కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు కానుందని తెలియవస్తోంది.


అయితే పెళ్లి వార్తలపై విక్కీ, కత్రినాల్లో ఏ ఒక్కరు స్పందించలేదు. కానీ, దీనిపై విక్కీ కౌశల్ కజిన్ ఒకరు అదంతా ఉత్తదేనని చెప్పారు. కానీ శశాంక్ ఖైతన్, షారుక్ ఖాన్, కరణ్ జోహార్ వంటి ప్రముఖ బాలీవుడ్ తారలకి ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు సమాచారం. కాగా కొన్ని కారణాల వల్ల కత్రినా మాజీ ప్రియుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం వీరి పెళ్లికి అటెండ్ కావట్లేదని చెబుతున్నారు. చూద్దాం.. ఎవరు వీరి గ్రాండ్ వెడ్డింగ్‌కి వస్తారో.. ఎవరు రారో..

Updated Date - 2021-11-29T16:52:36+05:30 IST