కొత్త దంపతుల Katrina Kaif, విక్కీ కౌశల్‌కు.. సల్మాన్, రణ్‌బీర్, షారూఖ్ ఎలాంటి ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చారంటే..
ABN , First Publish Date - 2021-12-16T18:57:39+05:30 IST
కత్రీనా కైఫ్ కాస్తా విక్కీ కౌశల్ వైఫ్ అయిపోయింది. డిసెంబర్ 9న గ్రాండ్ వెడ్డింగ్ జరిగిపోయింది. కొత్త దంపతులు రాజస్థాన్ నుంచీ వచ్చి ముంబైలో ల్యాండ్ కూడా అయిపోయారు. ఇక మిగిలింది రిసిప్షన్ మాత్రమే. అయితే, విక్యాట్ వెడ్డింగ్ విశేషాల కోలాహలం మాత్రం ఇంకా ఆగటం లేదు. తాజాగా విక్కీ, కత్రీనా నియర్ అండ్ డియర్ అందించిన ఖరీదైన బహుమతుల ముచ్చట్లు జోరుగా వినిపిస్తున్నాయి...

కత్రీనా కళ్యాణానికి బాలీవుడ్‌లోని చాలా మంది రాలేదు. కేవలం 120 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం లభించింది. అయితే, అందులో ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌గా ప్రచారంలో ఉన్న సల్మాన్, రణబీర్ ఇద్దరూ లేకపోవటం దాదాపుగా అందరూ ఊహించిందే! కానీ, లెటెస్ట్ న్యూస్ ఏంటంటే... సల్మాన్, రణబీర్ ఇద్దరూ తమ ‘గుడ్ ఫ్రెండ్’ కత్రీనాకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చారట!
కత్రీనాతో అనేక సినిమాలు చేసిన కండల వీరుడు సల్మాన్ ఆమెకు రియల్ లైఫ్‌లోనూ ఎంతో హెల్ప్ చేశాడని చెప్పుకుంటారు. ఒక విధంగా కత్రీనా కైఫ్ బాలీవుడ్లో ఇన్నేళ్లుగా నిలదొక్కుకోటానికి సల్మానే కారణమని చెప్పినా తప్పేం కాదు. అయితే, మరి తన ప్రియతమ స్నేహితురాలికి బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏం బహుమతి ఇచ్చి ఉంటాడు? అక్షరాలా మూడు కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ కారు!
కత్రీనా, విక్కీ తరువాత పెళ్లి సందడికి సిద్ధమవుతున్నారు రణబీర్, ఆలియా. ఈ లవ్ బర్డ్స్ వచ్చే సంవత్సరం ఏడు అడుగులు వేస్తారని టాక్. రణబీర్ 2.7 లక్షల విలువైన వజ్రాల హారం కత్రీనాకు బహుమతిగా ఇవ్వగా... ఆలియా లక్షల్లో విలువ చేసే పర్ఫ్యూమ్ బాస్కెట్‌ని కొత్త కపుల్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిందట!
ఇక విక్కీ, క్యాట్ ఇద్దరితోనూ చక్కటి ప్రొఫెషనల్ రిలేషన్స్ ఉన్న మరికొందరు బాలీవుడ్ సెలబ్స్ ఎలాంటి బహుమతులు ఇచ్చారంటే... బాద్షా షారుఖ్ ఖాన్ 1.5 లక్షల ఆర్ట్ వర్క్ ప్రజెంట్ చేశాడు, హృతిక్ 3 లక్షల విలువైన బీఎండబ్ల్యూ బైక్ అందించాడు, అనుష్కా శర్మ 6 లక్షల రూపాయల డైమండ్ ఇయర్ రింగ్స్ బహూకరించగా తాప్సీ పన్ను ప్లాటినమ్ బ్రేస్‌లెట్‌తో తన అభిమానం చాటుకుంది...