ప్రేమలో విఫలమైన Kangana Ranaut ..?

ABN , First Publish Date - 2021-11-29T21:07:38+05:30 IST

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్. బాలీవుడ్ సెలెబ్రిటీలపై తరచు విమర్శలు చేస్తు ఉంటుంది. నెపోటిజంపై గొంతెత్తి పోరాడుతుంటుంది

ప్రేమలో విఫలమైన Kangana Ranaut ..?

 వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్. బాలీవుడ్ సెలెబ్రిటీలపై తరచు విమర్శలు చేస్తు ఉంటుంది. నెపోటిజంపై గొంతెత్తి పోరాడుతుంటుంది. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుంది. ‘‘ భారత్‌కు స్వాతంత్ర్యం అనేది 2014లోనే లభించింది. 1947లో మనకు భిక్ష మాత్రమే లభించింది ’’ అని కంగన కొన్ని రోజుల క్రితం పేర్కొంది. దీంతో రాజకీయ నాయకులందరూ ఆమెను తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. ఆమెకిచ్చిన పద్మ శ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 


తాజాగా  ఇన్‌స్టా‌స్టోరీస్‌లో ఆమె ఒక పోస్ట్‌ను పెట్టింది. ఆ పోస్ట్ నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఒక కవితను హిందీలో ఆమె రాసింది. ‘‘ నీ కోసమే నేను జీవించాను. కానీ, నువ్వు నాతో అన్యాయంగా ప్రవర్తించావు ’’ అని ఆమె రాసింది. ఆ కవిత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో ఆమె లవ్ కెరీర్‌కు బ్రేకులు పడ్డాయని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రేమలో విఫలమైనట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ పోస్ట్‌కు కొన్నిరోజుల ముందే ‘‘ నాకు తల్లి కావాలని ఉంది. నేను చేసుకోబోయే వాడిని మీ అందరికి పరిచయం చేస్తాను ’’ అని కంగనా రనౌత్ పేర్కొనడం గమనార్హం.  Updated Date - 2021-11-29T21:07:38+05:30 IST