నాకొచ్చిన పద్మశ్రీ అవార్డు అందరి నోళ్లను మూయిస్తుంది: కంగనా రనౌత్

ABN , First Publish Date - 2021-11-09T00:38:53+05:30 IST

బాలీవుడ్‌పై విమర్శలు గుప్పిస్తూ తరచుగా వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్. జాతీయంగా చోటు చేసుకుంటున్న అంశాలపై ఆమె తన గళాన్ని వినిపిస్తుంటుంది.

నాకొచ్చిన పద్మశ్రీ అవార్డు అందరి నోళ్లను మూయిస్తుంది: కంగనా రనౌత్

బాలీవుడ్‌పై విమర్శలు గుప్పిస్తూ తరచుగా వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్.  జాతీయంగా చోటు చేసుకుంటున్న అంశాలపై  ఆమె తన గళాన్ని వినిపిస్తుంటుంది.  ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు, దీపావళి సందర్భంగా టపాసులను  కాల్చడం వంటి అనేక అంశాల మీద తన స్పందనను తెలిపి వార్త పత్రికల పతాక శీర్షికలకెక్కింది. తన కొచ్చిన పద్మ శ్రీ అవార్డు అనేక మంది నోళ్లను మూతబడేలా చేస్తుందని సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించింది. 


 రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా కంగనా రనౌత్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. న్యూఢిల్లీలో నవంబర్ 8న జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును అందజేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆమె తన ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్‌ను పంచుకుంది.‘‘ నేను కెరీర్‌ను ప్రారంభించనప్పుడు విజయాన్ని అందుకోవడానికి 8 నుంచి 10 ఏళ్లు పట్టింది.  కానీ, చివరికీ నేను విజయం సాధించాను. సినిమా ఇండస్ట్రీలో డబ్బు కంటె ఎక్కువగా నేను శత్రువులను సంపాదించుకున్నాను. సామాజిక, రాజకీయ అంశాలపై స్పందనను తెలపడంతో నా మీద అనేక కేసులు వేశారు. ఈ విధంగా ఎందుకు చేస్తావని నా స్నేహితులు తరచుగా అడుగుతుండేవారు. అది నా పని కాదని వారు చెప్పేవారు. నా మీద విమర్శలు గుప్పించిన వారందరికీ ఈ అవార్డు సమాధానం చెబుతోంది. ఈ అవార్డుతో వాళ్లందరి నోళ్లు మూతపడతాయి ’’ అని కంగనా రనౌత్  చెప్పింది. Updated Date - 2021-11-09T00:38:53+05:30 IST