నాపై ఎందుకు ఇంత కక్ష: కంగనా రనౌత్‌

ABN , First Publish Date - 2021-06-17T22:32:17+05:30 IST

కొంతకాలంగా తనకు ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు కంగనా రనౌత్‌. మరోసారి ఆమె అక్కడి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన పాస్‌పోర్ట్‌ విషయంలో ప్రభుత్వం పరోక్షంగా వేధింపులకు గురిచేస్తోందని ఆమె వెల్లడించారు.

నాపై ఎందుకు ఇంత కక్ష: కంగనా రనౌత్‌

కొంతకాలంగా తనకు ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు కంగనా రనౌత్‌. మరోసారి ఆమె అక్కడి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన పాస్‌పోర్ట్‌ విషయంలో ప్రభుత్వం పరోక్షంగా వేధింపులకు గురిచేస్తోందని ఆమె వెల్లడించారు. ఎవరో తెలియని వ్యక్తి తనపై పెట్టిన కేసు కారణంగా పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ చేయడానికి తిరస్కరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై హైకోర్డును ఆశ్రయించగా అప్లికేషన్‌ అస్పష్టంగా ఉందంటూ ఈ నెల 25కి విచారణ వాయిదా వేసింది’ అని కంగన పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అమిర్‌ఖాన్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని, అతని పాస్‌పోర్ట్‌ను నిలిపివేయలేదని,  ఎందుకు షూటింగ్స్‌కి ఆటంకం కలగనివ్వలేదని ఆమె ప్రశ్నించారు. తనని మాత్రమే ఇలా కక్ష సాధిస్తూ, వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కంగనా రనౌత్‌ ‘తేజస్‌’ సినిమా షూటింగ్‌ కోసం బుడాపెస్ట్‌కు వెళ్లాల్సి ఉంది. ఆమె పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ ప్రక్రియ పూర్తి చేయడానికి పోలీస్‌లు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! 


Updated Date - 2021-06-17T22:32:17+05:30 IST