అయ్యయ్యో.. Kajol ను నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారుగా.. ఆమె ధరించిన డ్రస్సుపై బీభత్సమైన ట్రోలింగ్..!
ABN , First Publish Date - 2021-10-29T21:43:44+05:30 IST
తన నటనతో, అందంతో, చిరునవ్వుతో బాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది కాజోల్.
తన నటనతో, అందంతో, చిరునవ్వుతో బాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది హీరోయిన్ కాజోల్. హీరో అజయ్ దేవ్‌గణ్‌తో వివాహం తర్వాత కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పటి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్లామరస్‌గా తయారవుతుంటుంది. అయితే తాజాగా ఆమె ధరించిన ఓ డ్రెస్ నవ్వుల పాలైంది. ఆ డ్రెస్‌పై నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌కు హాజరైన కాజోల్ వింత డ్రెస్‌తో అందరినీ షాక్‌కు గురి చేసింది.
బాడీ-కాన్ బ్లాక్ గౌన్ ధరించిన కాజోల్ రెడ్ కార్పెట్‌పై ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే కాజోల్ చేసిన ఆ ప్రయోగం అభిమానులకు నచ్చలేదు. దీంతో వారు కాజోల్ డ్రెస్‌పై సెటైర్లు పేల్చుతున్నారు. `అది డ్రెస్‌లా లేదు.. బైక్ మీద కప్పే కవరులా ఉంద`ని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. `బెడ్ షీట్లా ఉందేంటి.. నీకు అవార్డు రాకపోతే ఆ బెడ్ షీట్ వేసుకుని అక్కడే నిద్రపోవచ్చు`, `హాలోవీన్ డ్రెస్‌లా ఉంది` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.