సినిమా ప్రమోషన్లలో ‘జెర్సీ’ బ్యూటీ చేసిన పనికి.. విపరీతంగా ట్రోలింగ్ చేసిన నెటిజన్లు
ABN , First Publish Date - 2021-12-25T14:17:28+05:30 IST
‘లవ్ సోనియా’ మూవీతో 2018లో బాలీవుడ్‌కి పరిచయమైంది మృణాల్ ఠాకూర్. అనంతరం మంచి నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ గుర్తింపు పొందింది...
‘లవ్ సోనియా’ మూవీతో 2018లో బాలీవుడ్‌కి పరిచయమైంది మృణాల్ ఠాకూర్. అనంతరం మంచి నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ గుర్తింపు పొందింది. 2021లో మంచి బజ్ ఉన్న సినిమాలు పరాన్ అక్తర్‌తో ‘తుఫాన్’, కార్తీక్ ఆర్యన్‌తో ‘ధమకా’ చేసి సినీ జనాల మన్ననలు పొందింది. అయితే ఈ బ్యూటీ నటించిన మోస్ట్ అవెయిటెడ్ సినిమాతో ఈ ఏడాదికి ముగింపు పలకనుంది.
టాలీవుడ్ యంగ్ హీరో నాని నటించిన ‘జెర్సీ’ సూపర్‌హిట్ అయిన విషయం తెలిసిందే. జాతీయ అవార్డు సైతం గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు షాహిద్ కపూర్ హీరోగా బాలీవుడ్లో రిమేక్ అవుతోంది. దీనికి సైతం మాతృకకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరే దర్శకుడు. ఇందులో ఈ యంగ్ హీరోకి జోడిగా నటిస్తోంది మృణాల్. డిసెంబర్ 31న విడుదలకానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది మూవీ టీం. అయితే ఈ తరుణంలో ఈ బ్యూటీ ఓ పని చేసి విపరీతంగా ట్రోలింగ్కి గురైంది.
ప్రమోషన్ల పాల్గొన్న మృణాల్ మీడియా ఫోటోలకి ఫోజులిచ్చింది. అందులో రెడ్ షర్ట్, బ్లాక్ లెదర్ ప్యాంట్ వేసుకుంది ఈ బ్యూటీ. అయితే ఒక బటన్ మాత్రమే పెట్టుకుని మిగిలినవన్నీ ఓపెన్ చేసి నడుము కనింపించేలా.. ప్యాంట్లో బొటన వేలు పెట్టుకుని పిక్స్‌కి స్టిల్స్ ఇచ్చింది. దీంతో వైరలైన ఈ భామ పిక్స్ ట్రోలింగ్ చేశారు నెటిజన్లు.
‘అరే షర్ట్ బటన్ పెట్టుకోమ’ని కొందరు కామెంట్ పెట్టగా.. ‘మీ వేలును ప్యాంటుకు బదులుగా వేరే చోట ఉంచండం’టూ మరికొందరు ట్రోల్ చేశారు. అయితే ఈ భామ ప్రస్తుతం ‘అంక్ మిచోలి’ అనే ఫ్యామిలీ డ్రామా సినిమాలో, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ హీరోగా ‘పిప్ప’లో నటిస్తోంది.