కోట్ల కొద్దీ డబ్బు, వజ్రాలు పొదిగిన చెవి రింగులు.. Jacqueline కు సుఖేష్ ఇచ్చిన గిఫ్టుల జాబితా ఇదీ..!

ABN , First Publish Date - 2021-12-14T00:47:55+05:30 IST

సుఖేశ్ చంద్రశేఖర్ హవాలా కుంభకోణం ఊహించిన దానికంటే మరింత ఎక్కువగా సంచలనం అవుతోంది. రోజుకొక కొత్త విషయం వెలుగు చూస్తోంది. మరీ ముఖ్యంగా, సుఖేశ్ కేసుకి, బాలీవుడ్ భామలు జాక్విలిన్, నోరా ఫతేహికి లింక్ రానురాను సుస్పష్టం అవుతోంది. దాంతో ఈ వందల కోట్ల క్రిమినల్ వ్యవహారంపై జనం చూపు అంతకంతకు ఎక్కువవుతోంది.

కోట్ల కొద్దీ డబ్బు, వజ్రాలు పొదిగిన చెవి రింగులు.. Jacqueline కు సుఖేష్ ఇచ్చిన గిఫ్టుల జాబితా ఇదీ..!

సుఖేశ్ చంద్రశేఖర్ హవాలా కుంభకోణం ఊహించిన దానికంటే మరింత ఎక్కువగా సంచలనం అవుతోంది. రోజుకొక కొత్త విషయం వెలుగు చూస్తోంది. మరీ ముఖ్యంగా, సుఖేశ్ కేసుకి, బాలీవుడ్ భామలు జాక్విలిన్, నోరా ఫతేహికి లింక్ రానురాను సుస్పష్టం అవుతోంది. దాంతో ఈ వందల కోట్ల క్రిమినల్ వ్యవహారంపై జనం చూపు అంతకంతకు ఎక్కువవుతోంది.                          


ఢిల్లీలోని ఓ మహిళ నుంచీ 200 కోట్లు అక్రమంగా వసూలు చేసిన సుఖేశ్ చంద్రశేఖర్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్విలిన్ మొదట్లో చెప్పినప్పటికీ ఈడీ ముందు అన్ని నిజాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. ఆ మధ్య ఆమె దుబాయ్‌కి వెళ్లేందుకు ముంబై ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపేశారు. ఈడీ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని వార్నింగ్ ఇఛ్చారు. దాంతో గత్యంతరం లేక బీ-టౌన్ స్టార్ దర్యాప్తు సంస్థ ముందుకి వెళ్లింది.  అక్కడ ఆమె పలు కొత్త విషయాలు పేర్కొన్నట్టు ఈడీ చార్జీషీటు ద్వారా తెలుస్తోంది. 


జాక్విలిన్‌తో డేటింగ్ చేసిన సుఖేశ్ చంద్రశేఖర్ ఆమెకు ఖరీదైన గిఫ్టులు ఇచ్చాడు.  ఈ విషయం ఎప్పట్నుంచో ప్రచారం అవుతోన్నప్పటికీ తాజాగా మిస్ ఫెర్నాండెజ్ స్వయంగా తనకు అందిన గిఫ్టుల లిస్టుని బయటపెట్టింది. లక్షలు ఖరీదు చేసే ఓ గుర్రం, మూడు ఖరీదైన డిజైనర్ బ్యాగ్స్, రెండు అల్ట్రా కాస్ట్‌లీ జిమ్ వేర్, అలాగే, కాళ్లకు తొడిగే షూస్, చెవులకు ధరించే డైమండ్ ఇయర్ రింగ్స్, చేతులకి వేసుకునే రంగు రాళ్ల బ్రేస్‌లెట్స్... ఇలా బహుమతుల జాబితాలో బోలెడు సామాగ్రి ఉంది!


సుఖేశ్, జాక్విలిన్ వ్యవహారం ఖరీదైన వస్తువుల వద్ద ఆగిపోలేదు. నేరుగా డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసేశాడు ఆర్దిక మోసగాడు. అమెరికాలో ఉండే జాక్విలిన్ సోదరి ఖాతాలోకి సుఖేశ్ లక్ష యాభై వేల డాలర్లు పంపించాడట. అయితే, అది అప్పుగా అంటోంది జాక్విలిన్. మరోవైపు ఆస్ట్రేలియాలో ఉండే జాక్విలిన్ సొదరుడు కూడా సుఖేశ్ వద్ద నుంచీ 15 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ విషయాలన్నీ ఈడీ ఛార్జ్‌షీట్‌లో ఉన్నట్టుగా జాతీయ మీడియాలోని ఓ వర్గం చెబుతోంది. 


జాక్విలిన్‌తో క్లోజ్‌గా మూవ్ అయిన చంద్రశేఖర్ ఆమెకి పలుమార్లు ఛార్టర్ ఫ్లైట్స్‌లో ప్రయాణాలు కూడా ఏర్పాటు చేశాడట. ఆమె మకాం వేసే హోటల్స్‌లో బిల్స్ కూడా అతనే కట్టేవాడట. జాక్విలిన్ తరుఫున ఓ స్క్రిప్ట్ రైటర్‌కి డబ్బులు సైతం ఇచ్చాడని ఈడీ అధికారులు అంటున్నారు. ఇవన్నీ సుఖేశ్ తాను అక్రమంగా సంపాదించిన వందల కోట్ల లోంచే ఖర్చు చేశాడని దర్యాప్తు సంస్థ కోర్టులో పేర్కొనబోతోంది...         


సుఖేశ్ చంద్రశేఖర్ కేసు తాలూకూ సెగ నోరా ఫతేహీకి కూడా తప్పటం లేదు. ఆమె పేరు కూడా ఈడీ ప్రస్తావించినట్టు సమాచారం. విచారణలో నోరా తనకు సుఖేశ్ భార్య లీనా తెలుసునని చెప్పిందట. మొదటిసారి పరిచయం అయినప్పుడే లీనా తనకు ఖరీదైన బ్రాండెడ్ బ్యాగ్, ఐఫోన్ బహుమతిగా ఇచ్చిందట. మొబైల్ కాల్‌లో నోరాతో మాట్లాడిన సుఖేశ్ తాను, తన భార్య నోరాకి ఫ్యాన్స్ అని చెప్పుకున్నాడట. తరువాత కెనడియన్ బ్యూటీ మీద ప్రేమతో ఏకంగా బీఎండబ్ల్యూ కారొకటి గిఫ్ట్‌గా ఇచ్చాడు సుఖేశ్. కారు తీసుకున్నట్టు నోరా కూడా ఈడీ ముందు అంగీకరించినట్లు సమాచారం... Updated Date - 2021-12-14T00:47:55+05:30 IST