పెళ్లి జరిగే వరకు Katrina Kaif, విక్కీ కౌశల్ ఆ దుస్తులు చూడలేదు : సబ్యసాచి ముఖర్జీ

ABN , First Publish Date - 2021-12-14T00:25:48+05:30 IST

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబర్ 9న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో పెళ్లాడారు. బాలీవుడ్కు చెందిన అతిరథ మహారథులందరూ

పెళ్లి జరిగే వరకు Katrina Kaif, విక్కీ కౌశల్  ఆ దుస్తులు చూడలేదు : సబ్యసాచి ముఖర్జీ

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబర్ 9న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో పెళ్లాడారు. బాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులందరూ వీరి వివాహానికి హాజరయ్యారు. బీ టౌన్ సెలెబ్రిటీల కోసం త్వరలో ముంబయిలో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ పెళ్లి దుస్తులను బాలీవుడ్ సెలెబ్రిటీ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేశారు. ఆ పెళ్లి దుస్తుల వివరాలను తాజాగా ఆయన మీడియాకు వెల్లడించారు. 


‘‘ పెళ్లి జరిగే రోజు వరకు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వారు ధరించే దుస్తులను చూడలేదు. మేం వారి దుస్తులను వేర్వేరుగా డిజైన్ చేశాం. అయినప్పటికీ వారి ఆలోచనాలు ప్రతిబింబించేలా ఆ దుస్తులను రూపొందించాం.  కత్రినా లెహంగాను మట్కా సిల్క్‌తో, జర్దోరి బోర్డర్స్‌తో డిజైన్ చేశాం. విక్కీ కౌశల్ పంజాబీకి చెందినవాడు. అందువల్ల పంజాబీ ఇంటి కోడలిని ప్రతిబింబించేలా కత్రినా దుస్తులను రూపొందించాం ’’ అని సబ్యసాచి ముఖర్జీ చెప్పారు. పెళ్లినాడు విక్కీ కౌశల్ ఐవరీ సిల్క్ షేర్వాణీని ధరించాడు. చేతితో తయారు చేసిన గోల్డ్ ప్లేటేడ్ బెంగాల్ టైగర్ బటన్స్‌ ఈ షేర్వాణీకి ఉన్నాయి.

Updated Date - 2021-12-14T00:25:48+05:30 IST