తాప్సీ సినిమాకి దర్శకుడిని మార్చేశారా..!

ABN , First Publish Date - 2021-06-23T14:02:14+05:30 IST

తాప్సీ నటించబోతున్న బయోపిక్ 'శభాష్ మిథు'. ఈ సినిమాకి డైరెక్టర్‌ను మార్చినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఇందులో తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోంది. మిథాలీ రాజ్ జీవితంలో జరిగిన పలు సంఘటనలను, క్రికెట్ కెరీర్‌లోని విశేషాలను ఇందులో చూపించనున్నారు.

తాప్సీ సినిమాకి దర్శకుడిని మార్చేశారా..!

తాప్సీ నటించబోతున్న బయోపిక్ 'శభాష్ మిథు'. ఈ సినిమాకి డైరెక్టర్‌ను మార్చినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా  తెరకెక్కుతున్న ఇందులో తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోంది. మిథాలీ రాజ్ జీవితంలో జరిగిన పలు సంఘటనలను, క్రికెట్ కెరీర్‌లోని విశేషాలను ఇందులో చూపించనున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా డైరెక్టర్‌ను చేంజ్ చేస్తున్నట్టు సమాచారం. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తారని మేకర్స్ ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో దర్శకుడిగా శ్రీజిత్ ముఖర్జీ ఎంటరయ్యారట. మహిళల క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్న మిథాలీ పాత్రలో నటించేందుకు తాప్సి క్రికెట్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది. కాగా తాప్సి నటించిన 'హసీన్ దిల్ రుబా', 'రష్మీ రాకెట్' చిత్రాలు డిజిటల్ రిలీజు్‌కు రెడీ అవుతున్నాయి. 

Updated Date - 2021-06-23T14:02:14+05:30 IST