2021లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివారైన బాలీవుడ్ స్టార్స్ వీళ్లే..

ABN , First Publish Date - 2021-12-14T18:56:47+05:30 IST

ఇటీవలే పెళ్లి బంధంతో ఒకటైన విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వెడ్డింగ్ బాలీవుడ్‌లో ఎంత బజ్ క్రియేట్ చేసిందే తెలిసిందే. అయితే 2021లో వీరు మాత్రమే పెళ్లి పీటలు ఎక్కలేదు...

2021లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివారైన బాలీవుడ్ స్టార్స్ వీళ్లే..

ఇటీవలే పెళ్లి బంధంతో ఒకటైన విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వెడ్డింగ్ బాలీవుడ్‌లో ఎంత బజ్ క్రియేట్ చేసిందే తెలిసిందే. అయితే 2021లో వీరు మాత్రమే పెళ్లి పీటలు ఎక్కలేదు. మరికొందరూ బాలీవుడ్ స్టార్ సైతం మ్యారేజ్ చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వారి గురించి తెలుసుకుందాం..


వరుణ్ ధావన్ వెడ్స్ నటాషా దలాల్..

‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్’ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమై మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు వరుణ్ ధావన్. దాదాపు రెండు దశాబ్దాల ప్రేమ తర్వాత ఈ ఏడాది జనవరి 24న తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌ని  వివాహం చేసుకున్నాడు. కోవిడ్ సమయంలోనే వారి క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య అలీబాగ్‌లో పెళ్లి చేసుకున్నారు.


యామీ గౌతమ్ వెడ్స్ ఆదిత్యా ధర్..

బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్, ఫిల్మ్ మేకర్ ఆదిత్యా ధర్ జూన్ 4న వివాహ బంధంతో ఒకటయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలోని యామి ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ పెళ్లిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఈ జంట.


రాజ్‌కుమార్ రావ్ వెడ్స్ పత్రాలేఖ..

రాజ్‌కుమార్ రావ్, పత్రాలేఖ పదకొండేళ్ల క్రితం ఓ మూవీ షూటింగ్‌లో కలిశారు. అప్పటినుంచి వారు డేటింగ్ ఉన్న ఈ జంట ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తాజాగా నవంబర్ 15న చండీగర్‌లోని ది ఒబెరాయ్ సుఖ్విల్లాస్ స్పా రిసార్టులో కోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పెళ్లి బంధంతో ఒకటయ్యారు.


ఆదిత్య సీల్ వెడ్స్ అనుష్క రంజన్..

దాదాపు 4 సంవత్సరాల ప్రెండ్షిప్ తర్వాత 2019లో పారిస్‌లో అనుష్కకి ప్రపోజ్ చేశాడు ఆదిత్య. అనంతరం రెండేళ్లకి 2021 నవంబర్‌లో పెళ్లి చేసుకుంది ఈ జంట. అలియా భట్, భూమి పడ్నేకర్ వంటి ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరైన ఈ కపుల్ గ్రాండ్ వెడ్డింగ్ పిక్స్ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


విక్కీ కౌశల్ వెడ్స్ కత్రినా కైఫ్..

బాలీవుడ్‌లో ఎంతో కాలంలో వార్తల్లో నిలిచి రహస్యంగా పెళ్లి పీటలు ఎక్కిన కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఓ కోటలో జరిగిన ఈ జంట హై ప్రొఫైల్‌ మ్యారేజ్‌కి ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. కాగా వీరి పెళ్లి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ షేర్ చేసి తెలియజేసింది కత్రినా. ఫోటోలు పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్ల లైక్స్ సాధించి వైరల్‌గా మారిపోయాయి.Updated Date - 2021-12-14T18:56:47+05:30 IST