సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘అవతార్’ టీమ్‌తో హృతిక్ రోష‌న్‌

ABN, First Publish Date - 2021-06-13T22:47:59+05:30

ఆస్కార్ విన్నింగ్ విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్ సినిమాలో మేక‌ప్ టెక్నీషియ‌న్స్‌తో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాడా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. వివ‌రాల్లోకెళ్తే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్కార్ విన్నింగ్ విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్ సినిమాలో మేక‌ప్ టెక్నీషియ‌న్స్‌తో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాడా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. వివ‌రాల్లోకెళ్తే.. అల్లు అర‌వింద్‌, నిమిత్ మ‌ల్హోత్రా, మ‌ధు మంతెన క‌లిసి రామాయ‌ణంను త్రీడీ టెక్నాల‌జీతో రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రామాయంలో రాముడి పాత్ర ఎంత గొప్ప‌గా ఉంటుందో రావ‌ణాసురుడి పాత్ర‌కు అంతే ప్రాముఖ్య‌త ఉంటుంది. ఈ చిత్రంలో రావ‌ణాసురుడిగా హృతిక్ రోష‌న్ న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర‌ను స‌రికొత్త‌గా చూపించ‌బోతున్నారట‌. అందుకోసం నిర్మాత‌లు అవ‌తార్ మేక‌ప్ టీమ్‌ను రంగంలోకి దించుతున్నార‌ని టాక్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 

Updated Date - 2021-06-13T22:47:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!