‘అవతార్’ టీమ్‌తో హృతిక్ రోషన్
ABN , First Publish Date - 2021-06-13T22:47:59+05:30 IST
ఆస్కార్ విన్నింగ్ విజువల్ వండర్ అవతార్ సినిమాలో మేకప్ టెక్నీషియన్స్‌తో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి పనిచేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వివరాల్లోకెళ్తే.

ఆస్కార్ విన్నింగ్ విజువల్ వండర్ అవతార్ సినిమాలో మేకప్ టెక్నీషియన్స్‌తో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి పనిచేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వివరాల్లోకెళ్తే.. అల్లు అరవింద్, నిమిత్ మల్హోత్రా, మధు మంతెన కలిసి రామాయణంను త్రీడీ టెక్నాలజీతో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రామాయంలో రాముడి పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో రావణాసురుడి పాత్రకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ చిత్రంలో రావణాసురుడిగా హృతిక్ రోషన్ నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్రను సరికొత్తగా చూపించబోతున్నారట. అందుకోసం నిర్మాతలు అవతార్ మేకప్ టీమ్‌ను రంగంలోకి దించుతున్నారని టాక్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.