హృతిక్ రోషన్.. విక్కీ కౌశల్ సాయం
ABN , First Publish Date - 2021-06-04T06:45:06+05:30 IST
కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ టీవీ కార్మికులను ఆదుకునేందుకు బాలీవుడ్ కథానాయకుడు హృతిక్‌రోషన్ ముందుకొచ్చారు....

కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ టీవీ కార్మికులను ఆదుకునేందుకు బాలీవుడ్ కథానాయకుడు హృతిక్‌రోషన్ ముందుకొచ్చారు. సినీ,టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఆయన రూ. 20 లక్షల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువుల కిట్లు అందించారు. ఈ విషయాన్ని సంస్థ ప్రధాన కార్యదర్శి అమిత్ బెహల్ తెలిపారు. 5 వేల మంది సభ్యులకు వ్యాక్సిన్‌తో పాటు నిత్యావసరాలు అందించేందుకు ఈ డబ్బును వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు. హృతిక్ రోషన్ గతేడాది లాక్‌డౌన్ సమయంలో రూ. 25 లక్షల సాయం అందించారు. నటుడు విక్కీ కౌశల్ రూ. 2.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.