Harnaaz Sandhu : నిన్న సుస్మితా... నేడు నేను...
ABN , First Publish Date - 2021-12-27T00:30:37+05:30 IST
భారతదేశ తాజా విశ్వ సుందరి హర్నాజ్ సందూ మన మొట్ట మొదటి మిస్ యూనివర్స్ సుస్మితాని ప్రస్తావించింది. ఆమె తనకు ఎలా ప్రేరణగా నిలిచిందో తెలిపింది. సుస్మితా తన వ్యక్తిగత జీవితాన్ని, వృతి జీవితాన్ని అద్భుతంగా కొనసాగించిందని హర్నాజ్ పేర్కొంది. ఆమె భారతదేశం గర్వపడేలా చేసిందంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తింది.

తొలి భారతీయ విశ్వ సుందరిగా చరిత్ర సృష్టించిన నాటి నుంచీ సుస్మితా సాగించిన ప్రస్థానం అద్వితీయం అన్న చండీగఢ్ సుందరి హర్నాజ్ ‘‘నిన్నే ఆమె మిస్ యూనివర్స్ కిరీటం గెలిచినట్లుగా అనిపిస్తుంటుంది’’ అని చెప్పుకొచ్చింది. అయితే, సుస్మితా ప్రపంచ ప్రఖ్యాతి సాధించిన సమయానికి హర్నాజ్ కనీసం పుట్టను కూడా పుట్టలేదు. మన దేశ రెండో మిస్ యూనివర్స్ లారా దత్తా కిరీటం గెలిచిన సంవత్సరంలోనే ఆమె జన్మించింది. 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఇండియాకి హర్నాజ్ రూపంలో మూడో మిస్ యూనివర్స్ లభించింది!