Genelia ధరించిన ఈ చీర ఖరీదుపై నెట్టింట HOT టాపిక్..!

ABN , First Publish Date - 2021-11-09T00:59:35+05:30 IST

జెనీలియా అంటే ఒకప్పుడు సౌత్ ‘బాయ్స్’కి వీరాభిమానం. బాలీవుడ్‌లోనూ తన గ్లామర్‌తో కొంత వరకూ మాయ చేయగలిగింది, ‘బొమ్మరిల్లు’ హాసిని. అయితే, మాజీ మహారాష్ట్ర సీఎం కొడుకు, బాలీవుడ్ యాక్టర్ రితేశ్ దేశముఖ్‌ను పెళ్లాడక...

Genelia ధరించిన ఈ చీర ఖరీదుపై నెట్టింట HOT టాపిక్..!

జెనీలియా అంటే ఒకప్పుడు సౌత్ ‘బాయ్స్’కి వీరాభిమానం. బాలీవుడ్‌లోనూ తన గ్లామర్‌తో కొంత వరకూ మాయ చేయగలిగింది, ‘బొమ్మరిల్లు’ హాసిని. అయితే, మాజీ మహారాష్ట్ర సీఎం కొడుకు, బాలీవుడ్ యాక్టర్ రితేశ్ దేశముఖ్‌ను పెళ్లాడక క్రమంగా తెరకు దూరమైంది. ఇప్పుడు ఆమె పిల్లలు కాస్త పెద్దవ్వటంతో మరోసారి పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చేసింది. తాజాగా బుల్లితెరపై కాస్త సందడి చేసిన జెన్నీ బేబీ, ఇంటర్నెట్‌ తెరపైన కూడా, రోజుకొక న్యూ లుక్‌తో తన అందం ఏ మాత్రం తగ్గలేదని ఋజువు చేస్తోంది!


ప్రస్తుతం ఎటు చూసినా ఆన్‌లైన్ ట్రెండే నడుస్తోంది. అందుకే, సినిమా సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాకు పరుగులు పెడుతున్నారు. సెల్ఫీల నుంచీ మొదలు పెడితే ప్రొఫెషనల్ ఫోటోషూట్లదాకా ఏదో ఒక వంకతో నెటిజన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు. జెన్నీ కూడా సేమ్ టెక్నిక్ ఫాలో అవుతోంది. ఆమె తన ఫాలోయర్స్ కోసం ఈ మధ్య రెగ్యులర్‌గా సూపర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. వెస్ట్రన్ డ్రస్సెస్ ఎలాగూ అదరగొట్టేస్తుంటుంది... లెటెస్ట్‌గా, ‘సై’ బ్యూటీ చీరకట్టుకి కూడా సై అనేసింది. 


జెనీలియా డిసౌజా పచ్చ చీరలో పిచ్చెక్కించేసింది. అలాగనీ మరీ హాట్‌గా వగలేం పోలేదు. కానీ, ఆమె సింగారించిన 22 వేల రూపాయల ఖరీదైన ‘సూటీ’ కాటన్ శారీ ఇప్పుడు చూపరుల్ని కట్టిపడేస్తోంది. షర్ట్ లాంటి వైట్ కలర్ బ్లౌజ్‌ ధరించిన జెనీలియా భుజాల మాటు నుంచీ కిందకు జారుతోన్న జలపాతం లాంటి శిరోజాలతో ముగ్ధుమోహనంగా కనిపించింది!

Updated Date - 2021-11-09T00:59:35+05:30 IST