ఆంటీ కామెంట్‌పై స్పందించిన బొమ్మరిల్లు హీరోయిన్
ABN, First Publish Date - 2021-09-29T23:03:27+05:30
బాయ్స్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నటి జెనీలియా డిసౌజా. బొమ్మరిల్లు చిత్రంలో హా, హా, హాసిని అంటూ అమాయకత్వంతో కూడిన పాత్రలో కనిపించి తనకు నటనలో తిరుగులేదనిపించుకున్నారు. రెడీ, ఆరెంజ్, సై, శశిరేఖా పరిణయం వంటి చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు.
ముంబై: బాయ్స్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నటి జెనీలియా డిసౌజా. బొమ్మరిల్లు చిత్రంలో హా, హా, హాసిని అంటూ అమాయకత్వంతో కూడిన పాత్రలో కనిపించి తనకు నటనలో తిరుగులేదనిపించుకున్నారు. రెడీ, ఆరెంజ్, సై, శశిరేఖా పరిణయం వంటి చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. తాజాగా ఆమె ఒక బాలీవుడ్ టాక్‌షోలో పాల్గొన్నారు. షోలో భాగంగా హోస్ట్ అడిగిన అనేక ప్రశ్నలకు తనదైన శైలిలో స్పందించారు.
అర్భాజ్ ఖాన్ నిర్వహిస్తోన్న టాక్ షోలో తన భర్త రితేశ్ దేశ్ముఖ్తో కలిసి పాల్గొన్నారు. మీపై వచ్చే అసభ్యకరమైన కామెంట్స్‌కు ఏ విధంగా స్పందిస్తారని హోస్ట్ అడిగారు. ‘‘ నీ వయసుకు నువ్వు చేసే పనులకు సంబంధం లేదు. అతిగా ఎందుకు నటిస్తున్నావు. నిన్ను చూసి పిల్లలు కూడా భయపడతారు ఆంటీ. మేము ఈ విధంగా ప్రవర్తించబోము’’ అని నెటిజన్ చేసిన ఒక కామెంట్‌ను అర్భాజ్‌ఖాన్ చదివి వినిపించారు. జెనీలియా ఈ కామెంట్‌పై స్పందించారు. ‘‘ అతడి ఇంట్లో పరిస్థితులు బాగున్నట్లు నాకు అనిపించడం లేదు. ఇంట్లో నువ్వు బాగుండాలని ఆశిస్తున్నాను ’’ అని జెనీలియా ఆ షోలో అన్నారు. ‘‘ ఈ కామెంట్‌కు లవ్ యూ టు’’ అని బదులిచ్చేవాడినని రితేశ్ దేశ్‌ముఖ్ తెలిపారు.