సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Aryan Khan: అప్పటి వరకు ఇంట్లో స్వీట్స్ చేయడానికి వీల్లేదు.. గౌరీ ఖాన్ హెచ్చరికలు

ABN, First Publish Date - 2021-10-19T16:19:01+05:30

పుట్టినప్పటి నుంచి మొన్నటి వరకు రాజ భోగాలు అనుభవించిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్టినప్పటి నుంచి మొన్నటి వరకు రాజ భోగాలు అనుభవించిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. డ్రగ్స్ కేసులో ఈ నెల 2వ తేదీన అరెస్ట్ అయిన ఆర్యన్ ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. జైలు తిండి తినలేక నానా అవస్థలు పడుతున్నాడు. ఆర్యన్ పడుతున్న బాధలు వింటూ షారూక్, అతడి భార్య గౌరి నరకం అనుభవిస్తున్నారట. అతడిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై మరోసారి విచారణ జరగనుంది. 


కాగా, ఆర్యన్ బెయిల్‌పై విడుదలై ఇంటికి వచ్చే వరకు మన్నత్‌ (షారూక్ ఇల్లు) లో స్వీట్స్ చేయడానికి వీల్లేదని వంట వారికి గౌరి ఆర్డర్లు జారీ చేశారట. ఆదివారం మధ్యాహ్నం భోజన సమయంలో ఖీర్ వడ్డించడాన్ని చూసిన గౌరి ఈ మేరకు ఆజ్ఞలు జారీ చేసినట్టు సమాచారం. అర్యన్ అరెస్ట్ అయిన నాటి నుంచి గౌరి సరిగ్గా తినడం లేదని, నిద్రపోవడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఆమె దైవ ప్రార్థనలతోనే ఎక్కువ సమయం గడుపుతోందని సమాచారం. అలాగే ఈ కఠిన పరిస్థితుల్లో తమ ఇంటికి ఎవరూ రావొద్దని షారూక్ తన సన్నిహితులకు, బంధువులకు చెబుతున్నాడట. 

Updated Date - 2021-10-19T16:19:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!