సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kabir Khan : ‘‘నాకు తెలుసు... నన్ను, రణవీర్‌ని దేశం క్షమించదు’’

ABN, First Publish Date - 2021-12-18T21:02:40+05:30

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందించిన పీరియాడికల్ మూవీ ‘83’. టీమ్ ఇండియా తొలిసారి ప్రపంచ కప్ గెలుచుకున్న చారిత్రక క్షణాల్ని తన సినిమాలో పెద్ద తెరపై చూపించబోతున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్. అయితే, అటువంటి మహోన్నతమైన ఘట్టాన్ని మళ్లీ సృష్టించటం మామూలు విషయం కాదంటున్నాడు కబీర్. బిగ్ స్క్రీన్‌పై ఏ మాత్రం తేడా వచ్చినా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందించిన పీరియాడికల్ మూవీ ‘83’. టీమ్ ఇండియా తొలిసారి ప్రపంచ కప్ గెలుచుకున్న చారిత్రక క్షణాల్ని తన సినిమాలో పెద్ద తెరపై చూపించబోతున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్. అయితే, అటువంటి మహోన్నతమైన ఘట్టాన్ని మళ్లీ సృష్టించటం మామూలు విషయం కాదంటున్నాడు కబీర్. బిగ్ స్క్రీన్‌పై ఏ మాత్రం తేడా వచ్చినా... బిగ్ పనిష్మెంట్ తప్పదంటున్నాడు. తనని దేశం మన్నించదని కుండబద్ధలు కొట్టి చెబుతున్నాడు... 


‘‘ఇది నా మీద ఉంచిన పెద్ద బాధ్యత. ఆనాటి చారిత్రక విజయాన్ని తెరపై నేను సరిగ్గా పునర్ సృష్టి చేయలేకపోతే దేశం నన్ను మన్నించదు. ఆ విషయం నాకు తెలుసు. రణవీర్ సంగతి కూడా అంతే... అతను కపిల్ దేవ్‌గా తెర మీద పక్కాగా కనిపించలేకపోతే ప్రేక్షకులు ఎంత మాత్రం క్షమించరు’’ అన్నాడు కబీర్ ఖాన్. అయితే, రణవీర్ గురించి మరింతగా చెప్పుకొస్తూ... ఆయన కపిల్ దేవ్ లాంటి లెజెండ్ పాత్రలో నూటికి నూరు పాళ్లు గొప్పగా కనిపించాడని కితాబునిచ్చాడు. సినిమా విడుదల తరువాత భారతీయులందరూ తమ ప్రయత్నాన్ని మెచ్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు... 

Updated Date - 2021-12-18T21:02:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!