ఐపీఎల్ మాజీ యాంకర్‌తో మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఫర్హన్ అక్తర్..ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను పోస్ట్ చేసిన నటుడు

ABN , First Publish Date - 2021-10-18T21:46:42+05:30 IST

షారూఖ్ నటించిన డాన్, డాన్-2 వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన నటుడు ఫర్హన్ అక్తర్. తాజాగా తుఫాన్ సినిమాలో కనిపించారు. అతడు తన ప్రియురాలితో తీసుకున్న ఫొటోని

ఐపీఎల్ మాజీ యాంకర్‌తో మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఫర్హన్ అక్తర్..ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను పోస్ట్ చేసిన నటుడు

షారూఖ్ నటించిన డాన్, డాన్-2 వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన నటుడు ఫర్హన్ అక్తర్. తాజాగా తుఫాన్ సినిమాలో కనిపించాడు. అతడు తన ప్రియురాలితో తీసుకున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.


నటి, మోడల్, సింగర్ అయిన శిబానీ దండేకర్‌తో ఫర్హన్ అక్తర్ గత 3 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. ఇండియన్ ప్రీమీయర్ లీగ్‌ను(ఐపీఎల్) ఎప్పటి నుంచో చూసేవారికి శిబానీ దండేకర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆమె 2011 ఐపీఎల్ సీజన్‌కు యాంకర్‌గా వ్యవహరించింది. ఆమెతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అక్టోబర్ 18న ఫర్హన్ అక్తర్ పోస్ట్ చేశాడు. అతడు పోస్ట్ చేసిన ఫొటోలో ఇద్దరు కౌగిలింతల్లో మునిగి తేలుతున్నారు.


శిబానీ దండేకర్ ఆగస్టు 27న జన్మించింది. ఆమెకు ఆ రోజున రొమాంటిక్ గా ఫర్హన్ అక్తర్ విషెస్ తెలిపాడు. ‘‘ నీకు జన్మదిన శుభాకాంక్షలు శు. ఐ లవ్ యూ. నా మనసు నిండా నువ్వే ఉన్నావు ’’ అని రాశాడు. తాము డేటింగ్ చేస్తున్నట్టు 2018లో వారు అధికారికంగా ప్రకటించారు. వివాహం ఎప్పుడు చేసుకుంటారని ఆమెను అడగగా..‘‘ ప్రతి ఒక్కరు నన్ను ఆ ప్రశ్న అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఆ విషయం గురించి మేం ఎప్పుడు చర్చించుకోలేదు. ఒక వేళ నేను పెళ్లి చేసుకుంటే మీ అందరికీ తప్పక చెబుతాను. ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచనలు లేవు ’’ అని ఆమె వివరించింది.


ఫర్హన్ అక్తర్ కు గతంలోనే పెళ్లి అయింది. అతడు అధునా అనే హెయిర్ స్టైలిస్ట్‌ను అప్పట్లో వివాహం చేసుకున్నాడు. కానీ, వారు 2016లో విడాకులు తీసుకున్నారు. ఫర్హన్‌కు అకీరా, శాక్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విడాకుల అనంతరం అతడు శిబానీతో డేటింగ్ మొదలుపెట్టాడు. మలైకాఅరోరా కూడా విడాకులు తీసుకుని అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. 

Updated Date - 2021-10-18T21:46:42+05:30 IST