సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బోనీ ఫ్యామిలీకి దుబాయ్‌ గోల్డెన్‌ వీసా

ABN, First Publish Date - 2021-09-15T06:22:45+05:30

బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ కుటుంబానికి దుబాయ్‌ గోల్డెన్‌ వీసా లభించింది. ఈ విషయాన్ని బోనీకపూర్‌ మంగళవారం ట్విట్టర్‌లో తెలిపారు. అరుదైన గౌరవాన్ని అందించిన దుబాయ్‌ ప్రభుత్వానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ కుటుంబానికి దుబాయ్‌ గోల్డెన్‌ వీసా లభించింది. ఈ విషయాన్ని బోనీకపూర్‌ మంగళవారం ట్విట్టర్‌లో తెలిపారు. అరుదైన గౌరవాన్ని అందించిన దుబాయ్‌ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గోల్డెన్‌ వీసా పేరుతో 2019లో దుబాయ్‌ ప్రభుత్వం ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. కనీసం 10 లక్షల ఎమిరేటీ దిర్హమ్‌ పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు, వృత్తి నిపుణులు, సైన్స్‌, క్రీడా రంగాల్లో ప్రతిభావంతులు ఈ వీసాకి అర్హులు. ఐదేళ్లు, పదేళ్ల కాలానికి జారీ అయ్యే ఈ వీసాలను కాలపరిమితి ముగిశాక పునరుద్ధరిస్తారు. గతంలో బాలీవుడ్‌ నటులు షారూఖ్‌ఖాన్‌, సంజయ్‌ దత్‌, సునీల్‌ శెట్టి, మలయాళ హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌కు దుబాయ్‌ ప్రభుత్వం గోల్డెన్‌ వీసాలు మంజూరు చేసింది. 


Updated Date - 2021-09-15T06:22:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!