Drugs case: దర్యాప్తులో అధికారుల ముందు ఏడ్చేసిన Aryan Khan

ABN , First Publish Date - 2021-10-04T23:14:52+05:30 IST

ముంబయి తీరంలోని క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో ఆర్యన్‌తో సహా ఎనిమిది మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు.

Drugs case: దర్యాప్తులో అధికారుల ముందు ఏడ్చేసిన Aryan Khan

ముంబయి తీరంలోని క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో ఆర్యన్‌తో సహా ఎనిమిది మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. అధికారులు ప్రశ్నించనప్పుడు ఆర్యన్ గత కొంతకాలంగా డ్రగ్స్‌ను తీసుకుంటున్నట్టు అంగీకరించాడని బాలీవుడ్ మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. 


పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు అతడు ఏడ్చినట్టు మీడియా రిపోర్టులు తెలుపుతున్నాయి. గత 4 సంవత్సరాలుగా అతడు డ్రగ్స్‌ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దుబాయ్, బ్రిటన్ ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా మాదక ద్రవ్యాలను వాడుతున్నట్టు సమాచారం. ఎన్సీబీ అధికారులు ప్రశ్నించే సమయంలో తన తండ్రితో 2 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడేందుకే అతడికి అవకాశమిచ్చారు. 


పోలీసుల దాడిలో 13 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఏమ్‌డీ, 21 గ్రాముల చరస్‌తో పాటు రూ.1.33లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఆర్యన్‌తో సహా మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్, ఇస్మీత్ సింగ్, మొహక్ జస్వాల్, గోమిత్ చోప్రా, నూపుర్ సారిక, విక్రాంత్ చోకర్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.


   


Updated Date - 2021-10-04T23:14:52+05:30 IST