దయచేసి ‘ఆ పదం’ వాడొద్దంటోన్న వాళ్లిద్దరు...

ABN , First Publish Date - 2021-10-11T03:17:12+05:30 IST

ఒకరిలా ఇంకొకరు ఉండటం సృష్టిలో మామూలు విషయమే. కానీ, ఓ సెలబ్రిటీలా మామూలు వ్యక్తి ఉండటం... మామూలు సంగతి కాదు! పైగా ఓ అందమైన అమ్మాయి ఏకంగా కత్రీనాని పోలి ఉంటే? మరో అమ్మాయి కియారా లాగా మోహంలో ముంచేస్తుంటే?

దయచేసి ‘ఆ పదం’ వాడొద్దంటోన్న వాళ్లిద్దరు...

ఒకరిలా ఇంకొకరు ఉండటం సృష్టిలో మామూలు విషయమే. కానీ, ఓ సెలబ్రిటీలా మామూలు వ్యక్తి ఉండటం... మామూలు సంగతి కాదు! పైగా ఓ అందమైన అమ్మాయి ఏకంగా కత్రీనాని పోలి ఉంటే? మరో అమ్మాయి కియారా లాగా మోహంలో ముంచేస్తుంటే? ఇక చెప్పేదేముంది... సొషల్ మీడియాలో వారి ఫోటోలు, వీడియోలు వైరలే! 


అలీనా రాయ్ అచ్చం కత్రీనా లాగే ఉంటుంది. అంతే కాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె క్యాట్ లాగా కాస్ట్యూమ్స్‌తో, లిప్ సింకింగ్‌తో ఆకట్టుకుంటుంది కూడా. అయితే, స్వయంగా మోడల్ అయిన అలీనా బాలీవుడ్‌లో సీరియస్ కెరీర్ కోసం తపిస్తోంది. అందుకే, తనను కత్రీనా లాగా ఉన్నావంటూ ‘డోపెల్‌గాంగర్’ అనటం నచ్చదంటోంది. ఆ పదం వాడటం వల్ల తన వ్యక్తిత్వం, ప్రత్యేకత దెబ్బతింటాయని వాదిస్తోంది. తాను కత్రీనా లాగా ఉంటానని అనుకోవటం లేదని, తమ మధ్య జనానికి అంతగా పోలికలు ఏం కనిపిస్తున్నాయో అర్థం కావటం లేదంటోంది అలీనా. 


కత్రీనా లాగే కియారా అద్వాణీకి కూడా ఓ డూప్ ఉంది. ఆమె పేరు ఐశ్వర్య సింగ్. ఈమె కూడా కియారాలా కనిపిస్తుంటుంది, నెటిజన్స్ ముందు. ఆమెలాగే డ్రస్సింగ్ చేయటంతో పాటూ తనలాగే పాటలు, డైలాగ్స్‌కి లిప్ సింకింగ్ చేస్తుంది. కానీ, అచ్చం కియారాలా ఉందంటూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోన్న ఐశ్వర్యని ‘డొపెల్‌గాంగర్’ అనవద్దంటోంది మిస్ అద్వాణీ. ఆమె తనకంటూ ప్రత్యేకత కలిగిన వ్యక్తి అని వ్యాఖ్యానించింది. అంతే కాదు, ఐశ్వర్య సింగ్ డాక్టర్ అని కూడా గుర్తు చేసింది. 


కత్రీనాలా ఉన్న అలీనా తనని ‘డోపెల్‌గాంగర్’ అనవద్దంటోంది. తనలా ఉన్న ఐశ్వర్యని కూడా ‘డోపెల్‌గాంగర్’ అనవద్దని కియారా చెబుతోంది. వీళ్ల మాటలు విని... నెటిజన్స్ ఇక మీదట ‘ఆ పదం’ వాడకుండా ఉంటారా? లెట్స్ హోప్...  

Updated Date - 2021-10-11T03:17:12+05:30 IST