సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

గాయకుడు హనీ సింగ్‌పై గృహహింస ఆరోపణలు

ABN, First Publish Date - 2021-08-04T06:50:43+05:30

హిందీ గాయకుడు హనీ సింగ్‌ మద్యానికి, వ్యభిచారానికి బానిస అయ్యారని అతని భార్య శాలినీ సింగ్‌ ఆరోపించారు. ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టులో భర్తపై ఓ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందీ గాయకుడు హనీ సింగ్‌ మద్యానికి, వ్యభిచారానికి బానిస అయ్యారని అతని భార్య శాలినీ సింగ్‌ ఆరోపించారు. ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టులో భర్తపై ఓ పిటీషన్‌ దాఖలు చేశారామె. అందులో భర్త, అతని తల్లితండ్రులు, చెల్లెలు తనను శారీరకంగా, మానసికంగా పలుమార్లు వేధించారని పేర్కొన్నారు. గృహహింసకు లోనయ్యానని తెలిపారు. హానీమూన్‌లోనే తమ మధ్య మనస్ఫర్థలు తలెత్తాయని, తనపై హనీ సింగ్‌ చేయి చేసుకున్నాడని శాలినీ సింగ్‌ చెప్పుకొచ్చారు. ఆమె పిటీషన్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా హనీ సింగ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 23, 2011లో హనీ సింగ్‌, శాలినీ సింగ్‌కు వివాహమైంది. అయితే, చాలా రోజులు పెళ్లైన విషయాన్ని హనీ సింగ్‌ చెప్పలేదు. ప్రజలకు 2014లో, ఓ రియాలిటీ షోలో భార్యను పరిచయం చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు తాను బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు వెల్లడించారు. మద్యానికి బానిస అయినట్టు కూడా తెలిపారు. వివిధ మహిళలతో హనీ సింగ్‌ శారీరక సంబంధాలు ఉన్నాయని శాలిని ఆరోపిస్తున్నారు.


Updated Date - 2021-08-04T06:50:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!