‘పెళ్లి చేసుకున్నంత మాత్రాన హీరోయిన్ల కెరీర్ ఎండ్ అయినట్టు కాదు..’

ABN , First Publish Date - 2021-11-16T22:33:23+05:30 IST

‘అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో’తో 2004లో హిందీ చిత్ర పరిశ్రమలో రంగ ప్రవేశం చేసింది నటి దివ్య ఖోస్లా కుమార్. అనంతరం నిర్మాతగా, డైరెక్టర్‌గా..

‘పెళ్లి చేసుకున్నంత మాత్రాన హీరోయిన్ల కెరీర్ ఎండ్ అయినట్టు కాదు..’

‘అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో’తో 2004లో హిందీ చిత్ర పరిశ్రమలో రంగ ప్రవేశం చేసింది నటి దివ్య ఖోస్లా కుమార్. అనంతరం నిర్మాతగా, డైరెక్టర్‌గా తన ప్రతిభని చాటుకుంది ఈ సినీయర్ నటి. అయితే మొదటి సినిమా విడుదలైన 17 సంవత్సరాల తర్వాత రెండో చిత్రంగా జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న‘సత్యమేవ జయతే 2’ చేస్తోంది.


ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూ‌లో మాట్లాడింది దివ్య. అందులో..‘ఇంత గ్యాప్ తీసుకొని సినీ పరిశ్రమకి రి ఎంట్రీ ఇవ్వడం గురించి ఏమాత్రం బాధ లేదు. నిజానికి సరైన సమయంలో తిరిగి వచ్చా. ఇప్పుడు నటీమణులకి మంచి పాత్రలు రాస్తున్నారు కథకులు’ అంటూ చెప్పింది. అంతేకాకుండా..‘పెళ్లి అనేది కెరీర్ ఎండ్ కార్డనేది ఒకప్పటి మాట. ఆ స్థాయి నుంచి చాలా ముందుకు దూసుకువచ్చాం. దీపికా పదుకొనే, కరీనా కపూర్ ఖాన్ సాధించిన విజయాలే అందుకు నిదర్శనం. అదృష్టవశాత్తూ 90లలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవం’టూ చెప్పుకొచ్చింది ఈ దర్శకురాలు.

Updated Date - 2021-11-16T22:33:23+05:30 IST