డిసెంబర్‌లోగా పెళ్లి జరిగి తీరాల్సిందే.. అని Vicky Kaushal ని Katrina Kaif బలవంత పెట్టడం వెనుక..
ABN , First Publish Date - 2021-11-09T22:26:29+05:30 IST
తెలుగు వారికి మిస్ ‘మల్లీశ్వరి’గా తెలిసిన కత్రీనా... మిసెస్ విక్కీ కౌశల్ అయిపోయేందుకు తహతహలాడుతోంది! ఆల్రెడీ క్యాట్ అండ్ కౌశల్ లవ్ స్టోరీ ముంబైలో చాలా రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు వారికి మిస్ ‘మల్లీశ్వరి’గా తెలిసిన కత్రీనా... మిసెస్ విక్కీ కౌశల్ అయిపోయేందుకు తహతహలాడుతోంది! ఆల్రెడీ క్యాట్ అండ్ కౌశల్ లవ్ స్టోరీ ముంబైలో చాలా రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ ఎందరు ప్రచారం చేసిన మన రోమియో, జూలియట్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక ఇప్పుడైతే దీపావళి వేళ కత్రీనా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని ప్రచారం జోరుగా సాగుతోంది. ‘రోకా’గా పిలిచే నిశ్చితార్థం తంతూ పండుగ నాడు దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో జరిగినట్టు సమాచారం.
ఇటు కత్రీనాగానీ, అటు విక్కీ కౌశల్‌గానీ తమ రొకా జరిగినట్టు అఫీషియల్‌గా ప్రకటించలేదు. కానీ, మౌనం పూర్ణాంగీకరం అన్నట్టు ఉంది వారి వ్యవహారం. సైలెంట్‌గా డిసెంబర్లో జరగాల్సిన పెళ్లి వేడుకలపై దృష్టిపెట్టారట కాబోయే భార్యాభర్తలు!
ఈ మధ్యే ‘సర్ధార్ ఉదమ్’గా తెరపై కనిపించిన విక్కీ కౌశల్ మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందుకే, ఆయన ఆ షూటింగ్‌లు పూర్తి చేసుకుని 2022 మే నెలలో పెళ్లి పీటలెక్కాలని అనుకున్నాడట. కానీ, కత్రీనా డిసెంబర్ ఫస్ట్ హాఫ్‌లోనే మూడు ముళ్ల ముచ్చట జరిగిపోవాలని తొందరపెడుతోందట! ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం వాళ్ల వివాహం రాజస్థాన్‌లోని ఓ కోటలో జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకే, అక్కడ ఎండా కాలం వాతావరణం తీవ్రమైన వేడితో ఉంటుంది కాబట్టి కత్రీనా డిసెంబర్ వెడ్డింగ్ కోసం పట్టుబట్టిందట. పెళ్లి తంతు జరిగేప్పుడు హాజరైన అతిథులు ఉక్కపోతతో ఇబ్బంది పడకూడదన్నది ఆమె ఉద్దేశ్యమంటున్నారు.
విక్కీ కౌశల్ సమ్మర్ వెడ్డింగ్ వర్సెస్ కత్రీనా కైఫ్ వింటర్ వెడ్డింగ్ పోటీలో రాణివారి మాటే నెగ్గిందని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే కత్రీనా కళ్యాణానికి ఆల్రెడీ కౌంట్‌డౌన్ మొదలైనట్టే!