తన కుటుంబ సభ్యుల పేర్ల వెనకున్న సీక్రెట్ చెప్పిన Deepika Padukone!
ABN , First Publish Date - 2021-11-01T20:40:53+05:30 IST
వివాహం తర్వాత కూడా కెరీర్ మీదే దృష్టి సారించి వరుస సినిమాలతో బిజీగా ఉంది దీపికా పదుకొనే.

వివాహం తర్వాత కూడా కెరీర్ మీదే దృష్టి సారించి వరుస సినిమాలతో బిజీగా ఉంది దీపికా పదుకొనే. బాలీవుడ్‌లో అత్యంత భారీ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా కూడా అగ్రస్థానంలో ఉంది. హృతిక్ రోషన్, ప్రభాస్ వంటి హీరోల సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన దీపిక.. తనకెంతో ఇష్టమైన దీపావళి పండగ గురించి మాట్లాడింది. తన కుటుంబ సభ్యుల పేర్ల వెనకున్న సీక్రెట్‌ను కూడా వెల్లడించింది.
`మా నాన్న పేరు ప్రకాష్. అమ్మ పేరు ఉజ్వల. నా పేరు దీపిక. నా చెల్లి పేరు అనీషా. మా అందరి పేర్లూ వెలుగును ప్రతిబింబిస్తాయి. మా ఇంట్లో దీపావళి పండగను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేవాళ్లం. చిన్నప్పుడు చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా పండగను జరుపుకునే వాళ్లం. ఇప్పటికీ ఆ మధుర స్మృతులు కళ్ల ముందు కదలాడుతున్నాయ`ని దీపిక పేర్కొంది.