డిఫరెంట్ లుక్లో Deepika Padukone.. రణవీర్ బట్టలు వేసుకొచ్చావా అంటూ ట్రోలింగ్
ABN , First Publish Date - 2021-11-30T19:05:30+05:30 IST
బాలీవుడ్ తార దీపికా పదుకొనేకి ఉన్న క్రేజ్ తెలిసిందే. అందుకే పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. తన మూవీస్తోనే కాకుండా డ్రెసింగ్ స్టైల్తోనూ అభిమానుల హృదయాలను కొల్లగొడుతుంటుంది ఈ బ్యూటీ...
బాలీవుడ్ తార దీపికా పదుకొనేకి ఉన్న క్రేజ్ తెలిసిందే. అందుకే పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. తన మూవీస్తోనే కాకుండా డ్రెసింగ్ స్టైల్తోనూ అభిమానుల హృదయాలను కొల్లగొడుతుంటుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఈ తార డ్రెసింగ్తో ట్రోలింగ్కి గురైంది.
దీపికా సోమవారం ఓ ప్రైవేటు ఎయిర్పోర్టులో మీడియా కంటపడింది. దానికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇందులో ఈ బ్యూటీ కొంచెం వదులుగా ఉన్న నీలిరంగు డెనిమ్ జాకెట్, లైట్ బ్లూ కలర్ డెనిమ్ ప్యాంట్ ధరించింది. అంతేకాకుండా కాళ్లకి బ్లాక్ హై హీల్స్, సాక్సులతో పాటు వేసుకుంది. దీంతో వైరల్గా మారిన ఈ ఫోటోపై ట్రోలింగ్ చేశారు నెటిజన్లు.
‘నీ భర్త రణ్వీర్ సింగ్ బట్టలు వేసుకొచ్చవా?’ అంటూ కొందరు.. ‘సాక్సులతో హీల్స్ వేసుకోవడం స్టైల్ అనుకుంటుందా’ అని మరి కొందరు కామెంట్స్ పెట్టారు. ‘భార్యాభర్తలిద్దరికీ కొత్త స్టైలిష్ట్ అవసరం ఉంది. ఇలాంటి ఫ్యాషన్ అసలు ఫాలో అవ్వొద్దు. అసలు బాగాలేద’ ఇంకొందరు కామెంట్స్ పెట్టారు. అయితే, దీపికా ప్రస్తుతం భర్త రణ్వీర్ సింగ్తో కలిసి ‘83’, అమితాబ్ కలిసి ఓ సినిమా, అలాగే హృతిక్ రోషన్తో సినిమా.. ఇలా వరుసగా స్టార్ హీరోలతో మూవీస్ చేస్తూ కెరీర్లో దూసుకుపోతోంది.