Aamir Khan ‘తారే జమీన్ పర్’ సినిమాలో ఈ పిల్లాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలిస్తే..
ABN , First Publish Date - 2021-11-11T20:11:01+05:30 IST
2007లో ఆమీర్ ఖాన్ ‘తారే జమీన్ పర్’ సినిమాలో నటించాడు. అయితే, ఆ మూవీలో హీరో ఆమీర్ మాత్రమే కాదు. మరో హీరో ఉన్నాడు. అతనే, దర్శీల్ సఫారీ! ఇంతకీ తనెవరో తెలుసు కదా...

2007లో ఆమీర్ ఖాన్ ‘తారే జమీన్ పర్’ సినిమాలో నటించాడు. అయితే, ఆ మూవీలో హీరో ఆమీర్ మాత్రమే కాదు. మరో హీరో ఉన్నాడు. అతనే, దర్శీల్ సఫారీ! ఇంతకీ తనెవరో తెలుసు కదా... సినిమాలో ఓ ప్రత్యేకమైన మానసిక సమస్యతో సతమతం అయ్యే కుర్రాడు. ఆ పిల్లాడి యాక్టింగ్ అప్పట్లో దేశాన్ని మెస్మరైజ్ చేసింది. జనం మెచ్చుకోకుండా అస్సలు ఉండలేకపోయారు. తరువాత కూడా దర్శీల్ సఫారీ కొన్ని సినిమాల్లో బాల నటుడిగా అలరించాడు. బుల్లితెరపై కొన్ని రియాల్టీ షోస్ ద్వారా కూడా తన సత్తా చాటాడు. మరి ఆనాటి స్కూలు పిల్లాడు ఇప్పుడేం చేస్తున్నాడు? తెలియాలంటే దర్శీల్ సఫారీ ఇన్‌స్టా అకౌంట్లోకి తొంగి చూడాల్సిందే...
‘తారే జమీన్ పర్’ క్యూట్ బాయ్ ఇప్పుడు 24 ఏళ్ల యంగ్ మ్యాన్! దర్శీల్ సఫారీకి ఆన్‌లైన్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. 169కే ఫాలోయర్స్ అతడ్ని అనుసరిస్తున్నారు. అయితే, దర్శీల్ సొషల్ మీడియాలో రెగ్యులర్‌గా కనిపించే టైపు ఏం కాదు. అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటాడు. కానీ, ఎప్పుడు అటుగా వచ్చినా ‘వావ్’ అనిపించే ఫోటోనో, వీడియోనో ఫ్యాన్స్ కోసం పోస్ట్ చేస్తుంటాడు. అతడి డ్యాన్స్ వీడియోస్ చాలా సార్లు వైరల్ అవుతుంటాయి. అలాగే, అతడి కండలు తిరిగిన శరీరం కూడా అమ్మాయిల క్రేజ్‌కు కారణంగా చెప్పుకోవచ్చు. ‘రుమి‘ అనే సినిమాతో త్వరలో జనం ముందుకు రాబోతున్నట్టు, యంగ్ అండ్ హ్యాండ్సమ్ దర్శీల్, ఈ మధ్యే ప్రకటించాడు! చూడాలి మరి, ఈ చిన్న నాటి సూపర్ స్టార్ ఫుల్ లెంగ్త్ హీరోగా ఎటువంటి రెస్పాన్స్ సంపాదిస్తాడో...
