ఆ బాధతో కుమిలిపోయా.. బ్రేకప్‌పై ఓపెన్ అయిన ‘దంగల్ బ్యూటీ’

ABN , First Publish Date - 2021-11-29T22:04:07+05:30 IST

ఆమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైన నటి సన్యా మల్హోత్రా. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘మీనాక్షి సుందరెశ్వర్’ అనే మూవీతో మంచి విజయాన్ని అందుకుంది.

ఆ బాధతో కుమిలిపోయా.. బ్రేకప్‌పై ఓపెన్ అయిన ‘దంగల్ బ్యూటీ’

ఆమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైన నటి సన్యా మల్హోత్రా. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘మీనాక్షి సుందరెశ్వర్’ అనే మూవీతో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా బ్రైడ్స్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ తార.


లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి మాట్లాడుతూ.. ‘ఇది అలా జరిగిపోతుంది అంతే. నేను చాలా రిజర్వుడ్. కాబట్టి ఎవరితోనైనా ఈ విషయం గురించి మాట్లాడలేను. నన్ను చూసి 29 సంవత్సరాల శరీరంలో 89 ఏళ్ల ముసలిది ఉన్నట్లు నాకు నేనే ఫీల్ అవుతా. అందుకే నాకు నచ్చినవాడు కనిపిస్తే మేసేజ్ కానీ, కాల్ కానీ చేసి నాలోని భావాలు తెలుపుతా. ఇదంతా నా మనసులో ఉన్న ప్లానింగ్. ఇది చేయడం కష్టమే. కానీ ధైర్యాన్ని కూడగట్టుకొని ప్రయత్నిస్తా’నని సన్యా తెలిపింది.


రిలేషన్ షిప్‌లపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ..‘నేను ఈ మధ్య చాలా కాలంగా సింగిల్‌గా ఉన్నా. ఇప్పుడు నా ఫోకస్ అంతా నా మీద మాత్రమే ఉంది. నా మానసిక ఆరోగ్యాన్ని, నన్ను నేను బాగా చూసుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తున్నా. సాధారణంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఫోకస్ అంతా వేరేవారిపై ఉంటుంది. కానీ ఇప్పుడు నా దృష్టి అంతా నా పైనే ఉంద‌‌’ని ఈ బ్యూటీ చెప్పింది.


అంతేకాకుండా తన లవ్ బ్రేకప్ గురించి సన్యా మాట్లాడింది. ‘బ్రేకప్ అంతే అందరికి కష్టంగానే ఉంటుంది. గతంలో నేను ప్రేమించి వ్యక్తితో నాకు బ్రేకప్ అయింది. దీంతో ఆ బాధతో ఎంతో కుమిలిపోయా. ఎందుకంటే అది నాలుగేళ్ల ప్రేమ కావడంతో నా మనసు తట్టకోలేకపోయింది. ఢిల్లీలో ఉన్నప్పుడు మొదలైన రిలేషన్‌షిప్‌కి లాక్‌డౌన్ ముందు బ్రేక్ పడింది. కానీ నాకోటి అర్థమైంది. నా గురించి నేను ఆలోచించుకోవాలని. 2020 నాకు ఎంతో ఉపయోగపడింది. నా గత బంధంలో నాది లాంగ్ రిలేషన్‌షిప్ కావడంతో నా పార్టనర్‌కి నాకు మధ్య మంచి సంభాషణ మాత్రమే నడిచేది. కానీ అది కరెక్ట్ కాదు. వారిలోని తప్పులను కూడా ఖచ్చితంగా గుర్తించాలని తెలుసుకున్నా’నని ఈ భామ చెప్పుకొచ్చింది.

Updated Date - 2021-11-29T22:04:07+05:30 IST