బాయ్‌కాట్‌ రాధిక ఆప్టే!

ABN , First Publish Date - 2021-08-14T18:58:02+05:30 IST

కెరీర్‌ బిగినింగ్‌ నుంచీ విభిన్నమైన కథల్లో నటిస్తూ హిందీతోపాటు, దక్షిణాదిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు రాధిక ఆప్టే. వివాదాల్లో నిలిచే కథానాయికల్లోనూ ఆమె మొదటి వరుసలో ఉంటారు. వ్యక్తిగతంగానో, వృత్తి పరంగానో రాధిక చేసే వ్యాఖ్యలతో ఎన్నో సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుని ట్రోల్‌ అయిన సంగతి తెలిసిందే.

బాయ్‌కాట్‌ రాధిక ఆప్టే!

కెరీర్‌ బిగినింగ్‌ నుంచీ విభిన్నమైన కథల్లో నటిస్తూ హిందీతోపాటు, దక్షిణాదిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు రాధిక ఆప్టే. వివాదాల్లో నిలిచే కథానాయికల్లోనూ ఆమె మొదటి వరుసలో ఉంటారు. వ్యక్తిగతంగానో, వృత్తి పరంగానో రాధిక చేసే వ్యాఖ్యలతో ఎన్నో సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుని ట్రోల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సారి ఆమె నటించిన చిత్రమే వివాదాల్లోకి నెట్టింది. ఐదేళ్ల క్రితం రాధిక ఆప్టే నటించిన ‘పార్చ్‌డ్‌’ సినిమా సెగ మళ్లీ తాకింది. దీనితో మరోసారి ఆమె నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను వ్యతిరేకంగా చూపించే చిత్రాల్లో రాధిక నటిస్తున్నారంటూ పలువురు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాయ్‌కాట్‌రాధిక’ హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. అసలు విషయానికొస్తే.. స్ర్తీ విద్య, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేస్తూ తెరకెక్కిన ‘పార్చ్‌డ్‌’ సినిమాలో రాధిక ఆప్టే కీలక పాత్ర పోషించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం విమర్శల పాలైంది. అశ్లీల సన్నివేశాల్లో రాధిక నటించడం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రంతో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని నెట్టింట్లో వైరల్‌ కావడంతో మరోసారి రాధికపై నెటిజన్లు మండిపడుతున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు రాధిక చెడ్డ పేరు తెస్తుందని, అలాంటి వారితో సినిమాలు చేయడం మంచిది కాదని, ఆమెను బహిష్కరించాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  


Updated Date - 2021-08-14T18:58:02+05:30 IST