రాజవంశంలో పుట్టిన Kangana Ranaut పస్తులతో ఉంది తెలుసా...

ABN , First Publish Date - 2021-12-03T15:36:18+05:30 IST

కంగనా రనౌత్ రూపం కవ్వింపు... సారం మాత్రం సంచలనం! ఆమె మాట ఓ తూటా. ట్వీట్ చేస్తే వివాదం (అందుకే ఆమె ట్వీట్ అకౌంట్ ని Twitter సస్పెండ్ చేసింది), Instagram లో పోస్ట్ చేస్తే రచ్చ.. రగడ.

రాజవంశంలో పుట్టిన Kangana Ranaut పస్తులతో ఉంది తెలుసా...

Kangana Ranaut రూపం కవ్వింపు... సారం మాత్రం సంచలనం! ఆమె మాట ఓ తూటా. ట్వీట్ చేస్తే వివాదం (అందుకే ఆమె ట్వీట్ అకౌంట్ ని ట్విట్టర్ సస్పెండ్ చేసింది), Insta లో పోస్ట్ చేస్తే రచ్చ.. రగడ.


మన దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చింది 2014లో, 1947లో బ్రిటీషర్లు మనకు వేసింది భిక్ష మాత్రమే అంటూ ఇటీవల తన Instagramలో పోస్ట్ చేసి కలకలం రేపింది. 


సుప్రీం కోర్టులో తన మీద ఇటీవల కేసు ఫైల్ అయ్యిందని తెలిసిన వెంటనే దేశంలోనే 'అత్యంత శక్తిమంతమైన మహిళ'ని అంటూ కంగనా తనకి తానే కిరీటం పెట్టుకుంది.  అయితే, కొత్తగా ఆమెకి కిరీటాలు పెట్టనక్కర్లేదనీ, ఆమె పుట్టడమే రాణిగా పుట్టిందనీ అంటారు ఆమె అభిమానులు, ఆరాధకులు. 


కంగనాది హిమాచలీ రాజపుత్ర రాణావత్ వంశం. ఆమె ముత్తాత సర్జూసింగ్ రాణావత్ 1951లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆమె తాత బ్రహం చంద్ రాణావత్ IAS అధికారి, తండ్రి అమరదీప్ రాణావత్ వ్యాపారస్థుడు. ఇన్ని సిరిసంపదలు, భోగభాగ్యాలూ ఉన్నా, కంగనా అష్టకష్టాలు పడింది, పేదరికాన్ని కూడా అనుభవించింది. ఎందుకు? ఎందుకంటే తనకి ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంటానని మొండికేసినందుకు.


ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే కంగన మాట పట్టీంపుతో ఇల్లొదిలి బైటికొచ్చేసింది. తండ్రి అమరదీప్ కి ఆమెని డాక్టర్ ని చేయాలని కోరిక; కానీ, ఆమె యాక్టర్ని అవుతానంది.  అలాగైతే చిల్లిగవ్వ కూడా ఇచ్చేదే లేదని తెగేసి చెప్పాడు తండ్రి. తనే సంపాదించుకుంటానని హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. అత్యంత విలాసంగా పెరిగిన కంగన ఒక్కసారిగా పేదరికాన్ని చవిచూసింది. కొన్నాళ్ళు మోడలింగ్ చేసింది.నాటకాలు వేసింది.


ముంబై చేరుకుని దర్శకుడు మహేష్ భట్ ని కలుసుకుని నటించే అవకాశాన్ని కోరింది. అప్పుడాయన ‘గ్యాంగ్ స్టర్’ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 17 యేళ్ల అమ్మాయి హీరోయిన్ పాత్రకు చిన్నదైపోతుందని మొదట అనుకున్నా, తర్వాత ఆమెనే ఎన్నుకున్నారు. కంగనా రాణావత్ సినిమానటి అయిందని తెలియగానే తండ్రి ఇంకెప్పుడూ ఇంటిగుమ్మం తొక్కవద్దని ఆజ్ఞాపించాడు. తాతగారైతే తమ వంశాన్ని సూచించే ‘రాణావత్ ’ పదాన్ని పేరులో వాడవద్దని హెచ్చరించారు. ఇవేమీ కంగన లెక్కచేయలేదు. తనేమీ తప్పుచేయనప్పుడు ఎందుకు భయపడాలన్నది ఆమె వాదం. ఇప్పటికీ ఆమెది అదే వాదం!

Updated Date - 2021-12-03T15:36:18+05:30 IST