సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అలాంటి వారితో కలిసి పనిచేయాలంటే భయం వేస్తుందన్న సీనియర్ నటి, యంగ్ బ్యూటీ

ABN, First Publish Date - 2021-12-29T17:10:04+05:30

వరుసగా రొమాంటిక్ సాంగ్స్‌తో గ్లామర్ గాడెస్‌గా ఆనాటి యువతను ఉర్రూతలూగించిన నటి రవీనా టండన్.. మొదట టాలీవుడ్ సినిమాలు చేసిన అనంతరం బీ టౌన్‌లో సెటిల్ అయిన యంగ్ బ్యూటీ తాప్సీ పన్ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుసగా రొమాంటిక్ సాంగ్స్‌తో గ్లామర్ గాడెస్‌గా ఆనాటి యువతను ఉర్రూతలూగించిన నటి రవీనా టండన్.. మొదట టాలీవుడ్ సినిమాలు చేసిన అనంతరం బీ టౌన్‌లో సెటిల్ అయిన యంగ్ బ్యూటీ తాప్సీ పన్ను. ఈ నటీమణులిద్దరూ తమకున్న అతిపెద్ద భయం గురించి బయటపెట్టారు.


రవీనా, తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రవీనా మాట్లాడుతూ.. ‘షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా దర్శకుడు కన్‌ఫ్యూజన్‌లో ఉండి.. ఇలా మరోలా ట్రై చేద్దామని అడిగితే మేం చేయలేం. ఎందుకంటే ఆ పాత్రకి కావాల్సిన యాటిట్యూడ్‌నే మేం చూపించి ఉంటాం. ఆ డైరెక్టర్‌కి ఏం కావాలో అర్థంకాక ఆ సమయంలో మా మెదడులో ఓ యుద్ధం జరుగుతుంటుంద‌’ని తెలిపింది.


ఇదే విషయం గురించి తాప్పీ మాట్లాడుతూ.. ‘మొదట వారు ఒకటి అనుకుంటారు కానీ సెట్‌లో అకస్మాత్తుగా మారుతుంది. మేము చర్చించుకుని పాత్ర విధానం ఇలా ఉండాలనుకున్న సమయాల్లో ఇది జరిగింది. కానీ సెట్స్ వచ్చిన తర్వాత పాత్ర తీరుతెన్నులు మారతాయి.  దీంతో వారు చెప్పినట్లు చేయమని అడుగుతారు. ఇది నన్ను చాలా ఎక్కువగా భయపెడుతుంది. మీరు ఏమనుకుంటున్నారు.. ఏం చేయబోతున్నారో మాకు చెప్పాలి. కనీసం నెక్ట్ షాట్ ఏమిటో నాకు తెలియాలి. లేకపోతే దాని అవసరమైన భావోద్వేగాన్ని ఎలా తీసుకురాగలను?.. ఇలా చేయండి, అలాగే చేయండి, అంటే కష్టం కదా’ అని సినీయర్ నటికి వత్తాసు పలుకుతూ తన అనుభవాలను చెప్పుకొచ్చింది.


కాగా, రవీనా టండన్ ఇటీవలే చేసిన హట్‌స్టార్ సిరీస్ ‘అరణ్యక్’ మంచి టాక్ తెచ్చుకోగా.. తాప్సీ వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో దూసుకుపోతోంది.

Updated Date - 2021-12-29T17:10:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!