సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పెళ్లి పీటలు ఎక్కబోతున్న బాలీవుడ్ హీరో

ABN, First Publish Date - 2021-11-10T21:07:08+05:30

బాలీవుడ్‌లో విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రాజ్‌కుమార్ రావ్. స్త్రీ, లూడో, న్యూటన్, రాబ్తా తదితర చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రాజ్‌కుమార్ రావ్. స్త్రీ, లూడో, న్యూటన్, రాబ్తా తదితర చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు. అతడు త్వరలో ఒక ఇంటి వాడు కాబోతున్నాడని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన స్నేహితురాలైన పత్రలేఖను పెళ్లి చేసుకోబోతున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. చంఢీ‌గఢ్‌లో నవంబర్ 13వ తేదీన వీరి వివాహం జరగబోతుందని తెలుస్తోంది.


బాలీవుడ్‌కు చెందిన అత్యంత సన్నిహితులను మాత్రమే వీరి వివాహానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రాజ్‌కుమార్‌రావ్ తనకు కాబోయే భార్యకు స్పెషల్ వెడ్డింగ్ గిఫ్ట్ సిద్ధం చేసినట్టు సమాచారం. ‘‘ రాజ్‌కుమార్ రావ్, పత్ర‌లేఖ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కు మాత్రమే వీరు శుభలేఖలు పంపించారు ’’ అని రాజ్‌కుమార్ రావ్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తి తెలిపారు.  

Updated Date - 2021-11-10T21:07:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!