సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కు మాతృవియోగం

ABN, First Publish Date - 2021-09-08T16:38:47+05:30

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ముంబైలోని ఆ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఇటీవలే 'సిండ్రెల్లా' సినిమా షూటింగ్ కోసం లండన్‌ వెళ్ళిన అక్షయ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ముంబైలోని ఆ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఇటీవలే 'సిండ్రెల్లా' సినిమా షూటింగ్ కోసం లండన్‌ వెళ్ళిన అక్షయ్, తన తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెంటనే ముంబైకి తిరిగి వచ్చి ట్రీట్‌మెంట్‌పై దృష్టిపెట్టారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో నేడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అక్షయ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 'నాకు నా తల్లి ఎంతో బలం. ఆమె ఇక లేరనే విషయం గుండెను పిండేస్తుంది. నా తల్లి శ్రీమతి అరుణ భాటియా ప్రశాంతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. పరలోకంలో ఉన్న నా తండ్రిని చేరుకొనేందుకు వెళ్లారు. నా కుటుంబం అత్యంత విషాదంలో ఉన్న సమయంలో ఆమె కోసం మీ సంతాప సందేశాలను గౌరవిస్తాను. ఓం శాంతి అంటూ.. అక్షయ్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.   



Updated Date - 2021-09-08T16:38:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!