సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలీవుడ్ సెలెబ్రిటీలకు కరోనా

ABN, First Publish Date - 2021-12-29T20:44:18+05:30

కరోనా వైరస్ బాలీవుడ్ సెలెబ్రిటీలను వెంటడుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితమే కరీనా కపూర్, అమృతా అరోరాలకు కరోనా సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్ బాలీవుడ్ సెలెబ్రిటీలను వెంటడుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితమే కరీనా కపూర్, అమృతా అరోరాలకు కరోనా సోకింది. తాజాగా కపూర్ ఫ్యామిలీలోని మరికొందరు కోవిడ్-19 బారిన పడ్డారు. 


బోనీ కపూర్ పిల్లలైన అర్జున్ కపూర్, అన్షులా కపూర్, అనిల్ కపూర్ కూతురు రియా కపూర్, ఆమె భర్త కరణ్ బులానీ‌లు కరోనాకు పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం వారందరూ క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బోనీ కపూర్‌కు లక్షణాలు ఉన్నప్పటికి కరోనాకు నెగెటివ్‌గా తేలారు. అర్జున్ కపూర్ ప్రస్తుతం ముంబైలోని ఒక హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్నట్టు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. గత రాత్రి అతడు షూటింగ్‌లో పాల్గొన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.   


రణ్‌వీర్ షోరే కొడుకు హరూన్ షోరేకు కూడా డిసెంబర్ 28న కరోనా సోకింది. హరూన్ గోవాలో హాలీడేను ఎంజాయ్ చేసి తిరిగి వచ్చి పరీక్ష చేసుకోగానే కోవిడ్ సోకినట్టు వెల్లడైంది. 

Updated Date - 2021-12-29T20:44:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!