సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bollywood: టాప్ హీరో కారును చూసి నవ్విన బిచ్చగాడు.. సినిమాల్లో పెద్ద పెద్ద కార్లలో కనిపిస్తారేంటని ఎద్దేవా చేస్తే..

ABN, First Publish Date - 2021-10-04T21:54:39+05:30

ఖ్ టాండన్ సినిమాకు సహాయకుడిగా పనిచేస్తూ బాలీవుడ్‌లో కెరీర్‌ను ఆరంభించినవారు రణ్‌ధీర్ కపూర్. 1971లో విడుదలైన కల్ ఔర్ కల్ ఆజ్ చిత్రంతో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. జీత్, జవానీ దివానీ, పొంగ పండిత్, హత్ కీ సఫాయి తదితర చిత్రాల్లో నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేఖ్ టాండన్ సినిమాకు సహాయకుడిగా పనిచేస్తూ బాలీవుడ్‌లో కెరీర్‌ను ఆరంభించినవారు  రణ్‌ధీర్ కపూర్. 1971లో విడుదలైన కల్ ఔర్ కల్ ఆజ్ చిత్రంతో నటుడిగా తన ప్రయాణాన్ని  ప్రారంభించారు. జీత్, జవానీ దివానీ, పొంగ పండిత్, హత్ కీ సఫాయి తదితర చిత్రాల్లో నటించారు. తాజాగా ఆయన కపిల్‌శర్మ షోలో పాల్గొన్నారు. ఆ షోలో భాగంగా తన చిన్న కారును చూసి ఒక బిచ్చగాడు నవ్వాడని ఆ సంఘటన గురించి వివరించారు.


తను రాజ్ కపూర్ కొడుకుగా సినీ ఇండస్ట్రీలో కెరీర్‌ను ఆరంభించినా సాధారణ జీవితాన్ని గడుపుతూ బస్సులు, రైళ్లల్లో ప్రయాణించేవాడినని తెలిపారు. నటుడిగా మారాక ఒక చిన్న కారును కొనుగోలు చేశానని చెప్పారు. ఆ చిన్నకారును చూసి ఒక బిచ్చగాడు నవ్వాడని పేర్కొన్నారు. ‘‘ మీరు ఇంత చిన్న కారును నడుపుతారా? సినిమాల్లో మాత్రం ఫ్యాన్సీ కారును నడుపుతారు ’’అని ఆ బిచ్చగాడు నవ్వాడని వెల్లడించారు. ఫలితంగా తన ఇగో దెబ్బతిందన్నారు. తన భార్య బబిత కపూర్ నుంచి కొంత డబ్బు, నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకుని కొత్త కారుని కొనుగోలు చేసి నాన్నకు చూపెట్టాలనుకునన్నారు. నాన్నగారు అంగీకరించకపోవడంతో కొత్తకారును కొనలేదన్నారు.

Updated Date - 2021-10-04T21:54:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!